ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్ జై షా పదవీ బాధ్యతలు చేపట్టారు. జై షా ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.
జై షా మాజీ చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఐసీసీ చరిత్రలో ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా(36 ఏళ్ల వయసులోనే) జై షా రికార్డు సృష్టించారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం ఈ ఏడాది ఆగస్ట్‌ల్లో జరిగిన ఎన్నికల్లో జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
షా ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. షా ఈ రెండు పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఐసీసీ అత్యున్నత హోదాలో ఉండి జోడు పదవుల్లో కొనసాగరాదు.
షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌లుగా కొనసాగారు.
Syed Modi International: మూడోసారి సయ్యద్ మోదీ ఛాంపియన్‌గా నిలిచిన భారత స్టార్
Published date : 03 Dec 2024 12:42PM