ICC Test Ranking: ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా నంబర్‌వన్
2024 నవంబర్ 28న ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా నంబర్ 1 ర్యాంక్‌ను పొందారు. పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టి భారత జట్టును గెలిపించిన పర్ఫార్మెన్స్ ద్వారా బుమ్రా తన ర్యాంక్‌ను మూడో స్థానం నుంచి నంబర్‌వన్‌కు తీసుకెళ్లాడు. 883 పాయింట్లతో అతను తన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్‌ను కూడా అందుకున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి నంబర్ 1 ర్యాంక్‌ను సాధించిన బుమ్రా, అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో సిరీస్ అనంతరం కాస్త పడిపోయి, ఇప్పుడు మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ, ఆస్ట్రేలియా బౌలర్ జశ్ హేజిల్‌వుడ్, భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వరుసగా తదుపరి ర్యాంక్‌లలో నిలిచారు.
బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో.. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించి, రెండో స్థానంలో నిలిచాడు (825 పాయింట్లు). భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ 6వ స్థానంలో, విరాట్ కోహ్లి 13వ స్థానంలో ఉన్నారు.
ఆల్‌రౌండర్ల విభాగంలో.. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
Asian Champions Trophy: అరుదైన రికార్డు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్