Skip to main content

Home Guards Salaries : తెలంగాణ‌ హోంగార్డుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌.. ఇక‌పై జీతం రెట్టింపు.. ఎంతంటే..!

హోంగార్డుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ నుంచి ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వంలో భాగంగా ఒక శుభవార్త అందింది.
Increase in salaries for telangana home guards   Telangana CM Revanth Reddy announces salary increase for home guards  Telangana home guards to get salary boost as per CM Revanth Reddy's new decision

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రంలో హోంగార్డుల‌కు శుభ‌వార్తను అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవ‌లె నిర్వ‌హించిన ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో హోంగార్డు ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల‌ జీతాలను ఇక‌పై రెట్టింపు కానున్నాయ‌ని తెల‌పుతూ వారి వేత‌నాన్ని పెంచుతున్నామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Telangana Tenth Class News: పదో తరగతి సిలబస్‌ను జనవరి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ

ప్రజాపాలన విజయోత్సవ కార్య‌క్ర‌మంలో భాగంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌) లోగోని, సంబంధిత వాహనాలను, బోట్లను సీఎం ప్రారంభించారు. అయితే, ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. డిసెంబ‌ర్ 6వ తేదీ.. హోంగార్డ్స్ దినోత్స‌వం కాగా, వారంద‌రికి ప్ర‌భుత్వం త‌ర‌పున‌ ఒక శుభ‌వార్త అంటూ..

Bank Timings changed: ఇక నుంచి బ్యాంకులకు కొత్త టైమింగ్స్..? ఖాతాదారులు అలర్ట్..!

హోమ్ గార్డులకు ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న రూ.921ను వేత‌నాన్ని రూ.1,000కు, వీక్లీ ప‌రేడ్ అల‌వెన్స్ నెల‌కు రూ.100 నుంచి రూ. 200కు పెంచుతున్నాట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా, దుర‌దృష్ట‌వ‌శాత్తుగా స‌హ‌జ‌మ‌ర‌ణం, ప్ర‌మాదంలో మ‌ర‌ణం పొందినా, వారికి రూ. 5 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ఉంటుంద‌ని నిర్ణ‌యించాం అంటూ శుభ‌వార్తను వివ‌రిస్తూ ఈ పెరిగిన జీతాలు ఉద్యోగుల‌కు వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి నుంచి అమ‌లు కానున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Dec 2024 10:59AM

Photo Stories