Govt Employees : శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు.. ఇవే..
సాక్షి ఎడ్యుకేషన్: ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి ప్రత్యేక సెలవులు అందించడం శుభవార్తే కదా.. మరి ఆ సెలవులు ఏంటో.. అవి ఎవరికి ఎలా ఉన్నాయో, ఎన్ని ఉంటాయో తెలుసుకుందామా..
1. చైల్డ్ కేర్ లీవ్:
రూల్ 43 సీ ప్రకారం.. స్త్రీ ఉద్యోగి, సింగిల్ పురుష ఉద్యోగులు పెంపకం లేదా విద్య, అనారోగ్యం వంటి వారి అవసరాలను చూసుకోవడానికి ఇద్దరు జీవించి ఉన్న పిల్లలను చూసుకోవడానికి వారి మొత్తం సర్వీసులో 730 రోజులు మంజూరు చేస్తారు. ఇది ఒక క్యాలెండర్ సంవత్సరంలో మూడు విడతలకు మించి మంజూరు చేయబడదు.
Andesri State Anthem: పాఠ్యపుస్తకాల్లో అందెశ్రీ రాష్ట్ర గీతం
కానీ, సింగిల్ స్త్రీ ఉద్యోగి విషయంలో ఇది ఒక క్యాలెండర్ సంవత్సరంలో 6 విడతలకు పొడిగించబడుతుంది. చైల్డ్ కేర్ సెలవును ఒక విడతలో 5 రోజుల కంటే తక్కువ కాలానికి మంజూరు చేయకూడదు. ఇది ఏదైనా ఇతర రకాల సెలవుతో కలిపి వాడుకునే అవకాశం ఉంటుంది.
2. ప్రసూతి సెలవు:
రూల్ 40 ప్రకారం.. ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న (అప్రెంటీస్‌తో సహా) స్త్రీ ఉద్యోగికి 180 రోజుల పాటు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు. గర్భస్రావం, గర్భ విచ్ఛిత్తి విషయమై జీవించి ఉన్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా స్త్రీ ప్రభుత్వ ఉద్యోగులకు 45 రోజులు మించని ప్రసూతి సెలవును మంజూరు చేస్తారు.
Job opportunities: జాబ్‌మేళాతో ఉద్యోగ అవకాశాలు..
ప్రసూతి సెలవును ఏదైనా ఇతర రకాల సెలవుతో కలపవచ్చు. సరోగసీ విషయంలో సరోగేట్ ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న కమిషనింగ్ తల్లికి 180 రోజుల పాటు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.
3. పితృత్వ సెలవు:
రూల్ 43 ఎ ప్రకారం.. ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న (అప్రెంటీస్‌తో సహా) పురుష ప్రభుత్వ ఉద్యోగికి తన భార్య ప్రసవ సమయంలో 15 రోజుల పాటు పితృత్వ సెలవు మంజూరు చేస్తారు. అంటే పిల్లల ప్రసవ తేదీకి 15 రోజుల ముందు లేదా 6 నెలల వరకు..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
పితృత్వ సెలవును ఏదైనా ఇతర రకాల సెలవుతో కలిపి వాడుకోవచ్చు. సరోగసీ కేసులో కూడా పురుష ప్రభుత్వ ఉద్యోగులు పితృత్వ సెలవుకు అర్హులు. రూల్ 43 ఎఎ ప్రకారం.. పిల్లల దత్తత విషయంలో కూడా పితృత్వ సెలవు ఉంటుంది.
4. బాల దత్తత సెలవు:
రూల్ 43 బీ ప్రకారం.. ఇద్దరు కంటే తక్కువ పిల్లలు ఉన్న స్త్రీ ప్రభుత్వ ఉద్యోగి దత్తత తీసుకోవడానికి ఒక బిడ్డను అంగీకరించినప్పుడు 180 రోజుల సెలవు మంజూరు చేస్తారు. ఇట్టి సెలవు ఏదైనా ఇతర రకాల సెలవుతో కలిపి వినియోగించుకునే అవకాశం ఉంది.
5. పని సంబంధ వ్యాధి, గాయం సెలవు:
రూల్ 44 ప్రకారం.. ఈ సెలవు తన అధికారిక విధుల నిర్వహణలో ఆరోగ్యం క్షీణించిన లేదా గాయపడిన ఉద్యోగికి మంజూరు చేస్తారు. 6 నెలల పూర్తి జీతభత్యాలు, 12 నెలల సగం జీత భత్యాలు చెల్లించబడతాయి. ఈ 12 నెలలు సగం జీతం సెలవు ఖాతా నుండి డెబిట్ చేయబడతాయి. ఈ సెలవు కాలంలో నగదు జీతపు సెలవు, సగం జీతపు సెలవు క్రెడిట్ చేయరు.
6. లైంగిక వేధింపులకు ప్రత్యేక సెలవు:
రూల్ 51 ప్రకారం.. ఈ ప్రత్యేక సెలవు పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల కింద విచారణ సమయంలో అంతర్గత కమిటీ లేదా స్థానిక కమిటీ సిఫార్సు చేసినప్పుడు 90 రోజుల పాటు స్త్రీ ప్రభుత్వ ఉద్యోగికి మంజూరు చేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
7. అధ్యయన సెలవు :
రూల్ 51 ప్రకారం.. కొన్ని నిబంధనలకు లోబడి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు ప్రభుత్వ ఉద్యోగులకు అధ్యయన సెలవు మంజూరు చేస్తారు.
8. సిమెన్స్ సిక్ లీవ్:
రూల్ 47 ప్రకారం.. ప్రభుత్వ నౌకలో వారెంట్ ఆఫీసర్ లేదా పెటీ ఆఫీసర్ తన నౌకలో లేదా గాయం కారణంగా వైద్య చికిత్స పొందుతున్నప్పుడు ఈ రకమైన సెలవు మంజూరు చేస్తారు. మొదటి ఆరు వారాలకు పూర్తి జీత భత్యాలు చెల్లించబడతాయి. ఉద్యోగి డిసెబులిటీతో ఉంటే, 3 నెలల వరకు పూర్తి జీతం, భత్యాలు చెల్లించబడతాయి.
Free laptop Scam: విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్.. ఈ విషయం మీరు గమనించారా?
ఇలా, ప్రభుత్వ ఉద్యోగులు వారికి అవసరం ఉన్న సమయంలో ఈ రూల్స్ ప్రకారం ప్రకటించిన విధంగా సెలవులను ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ స్త్రీ, పురష ఉద్యోగులకు సంబంధించిన వ్యక్తిగత సెలవులు, ప్రభుత్వ సెలవులు వంటి ప్రత్యేక సెలవులను ప్రకటించి ఉద్యోగులకు శుభవార్త తెలిపింది.
Tags
- central govt employees
- Good News
- special leaves
- rules for leaves
- govt employees
- men and women leaves
- special leaves for central govt employees
- pregnancy leaves
- personal leaves
- health issue leaves for men and women
- good news for central govt employees
- govt job holders
- central government
- central govt announces good news for employees
- special leaves announcement
- men govt employees special leaves
- limit of leaves
- special leaves according to rules
- Education News
- Sakshi Education News
- CentralGovernmentHolidays
- SpecialHolidays
- GovernmentEmployees
- HolidaySchedule
- GovernmentLeavePolicy
- GovernmentNews