Skip to main content

Provisional Selection List: వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల ప్రొవిజనల్‌ జాబితా విడుదల

Provisional list released for various posts in the district medical department  Medical officers and pharmacist positions available under the National Health Mission Provisional Selection List  DMHO Rajender announcing the provisional list for medical officer and pharmacist recruitment  Notification for recruitment of medical officers and pharmacist in RBSK mobile health team
Provisional Selection List

నిర్మల్‌చైన్‌గేట్‌: వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్‌ జాబితా విడుదల చేసినట్లు డీఎంహెచ్‌వో రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద ఒప్పంద ప్రాదిపదికన ఆర్‌బీఎస్కే మొబైల్‌ హెల్త్‌ టీంలో నాలుగు మెడికల్‌ ఆఫీసర్స్‌(రెండు మేల్‌, రెండు ఫీమెల్‌), ఫార్మసిస్ట్‌ విభాగంలో ఒక పోస్టు భర్తీకి గత నెల 10న నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు.

JNTUH B.Tech Results: బీటెక్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లో మిడల్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌కు సంబంధించి 15 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 23న నోటిఫికేషన్‌ విడుదల చేశామని పేర్కొన్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద డిస్ట్రిక్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ 1, సైకాలజిస్ట్‌ 1, స్టాఫ్‌నర్స్‌ 9, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ కం అకౌంటెంట్‌ 2, రిఫ్రిజ్‌రేటర్‌ మెకానిక్‌ 1, ఏఎన్‌ఎం 6 పోస్టులకు ఫిబ్రవరి 29న నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు.

Open School Admissions News: ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు 28 వరకు గడువు పెంపు

ఆ యా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను www.nirmal. telangana.gov.in వెబ్‌సైట్‌తో పాటు డీఎంహెచ్‌వో కార్యాలయం నోటీస్‌ బోర్డుపై అందుబాటులో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డీఎంహెచ్‌వో కార్యాలయం, dmhonirmal recruitments@gmail.comకు పంపించాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 25 Sep 2024 09:31AM

Photo Stories