Skip to main content

Germany Job Offers : బీఎస్సీ నర్సింగ్ నిరుద్యోగుల‌కు జ‌ర్మ‌నీలో ఉద్యోగావ‌కాశాలు..

Job opportunity for bsc nursing unemployed graduates  Anantapur job opportunities for GNM and BSc Nursing graduates in Germany

అనంతపురం: జనరల్‌ నర్సింగ్‌ మిడ్వైఫరీ(జీఎన్‌ఎం), బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీవీ ప్రతాప్‌ రెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జర్మన్‌ లాంగ్వేజ్‌పై శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.75 వేలు కాషన్‌ డిపాజిట్‌ చెల్లించడంతోపాటు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Paramedical courses Admissions: పారామెడికల్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

రెసిడెన్షియల్‌ శిక్షణతోపాటు ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులకు వీసా ఫీజు, రానుపోను విమాన టిక్కెట్లు చెల్లిస్తామని తెలిపారు. జర్మనీలో సుమారు రూ.2,33 లక్షల నుంచి 3,26,000(2400 యూరోల నుంచి 3500 యూరోల వరకు) వరకు వేతనం చెల్లిస్తారని పేర్కొన్నారు. వివరాలకు 99888 53335 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 19 Nov 2024 09:56AM

Photo Stories