Skip to main content

Jobs In Medical College: మెడికల్‌ కాలేజీలో పోస్టులు.. 19 మంది నియామకం

Jobs In Medical College recruitment in medical college recruitment in Rajanna Sirisilla Medical College     newly appointed professors at Rajanna Sirisilla Medical College

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్స్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 19 మందిని కాంట్రాక్టు పద్ధతిపై నియమించినట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా గురువారం తెలిపారు. 69 పోస్టులకు కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు జరిగాయి.

PG Courses: పీజీ కోర్సులపై తగ్గుతున్న ఆసక్తి.. సీటు వచ్చినా చేరడం లేదు

కేవలం 19 మంది అభ్యర్థులు మాత్రమే హాజరుకావడంతో ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక్క అసోసియేట్‌ ప్రొఫెసర్‌, పది మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఆరుగురు సీనియర్‌ రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్లను నియమించారు. నియామక పక్రియకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన, అడిషనల్‌ కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ వైస్‌ చైర్మన్‌గా, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ కన్వీనర్‌గా వ్యవహరించారు.

Free Training: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా శిక్షణతో పాటు ఉపాధి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం.వసంత్‌రావు, జిల్లా ఎంప్లాయీమెంట్‌ ఆఫీసర్‌ రాఘవేందర్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ చీకోటి సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఎంపికై నా 19 మందికి నియామక పత్రాలను అందించారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 21 Sep 2024 09:29AM

Photo Stories