PG Courses: పీజీ కోర్సులపై తగ్గుతున్న ఆసక్తి.. సీటు వచ్చినా చేరడం లేదు
కర్నూలు కల్చరల్: ఒకప్పుడు పీజీ కోర్సులకు భారీగా డిమాండ్ ఉండేది. వర్సిటీల్లో సీటు దక్కాలంటే ఎంతో కష్టపడి చదవాల్సి ఉండేది. మంచి ర్యాంక్ వచ్చినా కొన్ని సార్లు సీటు దక్కని పరిస్థితి. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దరఖాస్తు చేసుకుంటే చాలు సీటు వస్తుంది. అయినా, చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఆర్‌యూ క్యాంపస్ కళాశాలల్లో 480 సీట్లకు గాను కేవలం 145 సీట్లే భర్తీ కావడమే అందుకు ఉదాహరణ.
డిపార్ట్‌మెంట్లు వెలవెల
గతంలో ఎప్పుడూ లేని విధంగా రాయలసీమ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలు భారీగా తగ్గాయి. ఇదివరకులాగా సంప్రదాయ పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.
Overseas Job opportunities: విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
దీంతో ఆర్‌యూ పరిధిలోని కళాశాలల్లో సీట్లు భర్తీ కాని పరిస్థితి నెలకొంది. ఆర్‌యూ క్యాంపస్ కళాశాలల్లో ఆర్ట్స్‌కు సంబంధించి మూడు డిపార్ట్‌మెంట్లలో మూడు కోర్సుల్లో 172 సీట్లు, సైన్స్‌కు సంబంధించి 9 డిపార్ట్‌మెంట్లలో 9 కోర్సులకు 375 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం 547 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరం అందులో 145 సీట్లే భర్తీ అయ్యాయి. ఇందులో ఎకనామిక్స్‌లో 3, స్టాటిస్టిక్స్ 5, మ్యాథ్స్ 6, తెలుగు 6, కెమిస్ట్రీ (ఎస్‌ఎఫ్) 6, ఫిజిక్స్‌లో 7 సీట్లే భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన వారిలో ఎంత మంది అడ్మిషన్ తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.
Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
- గత ఏడాది 547 సీట్లకు 240 ప్రవేశాలు పొందడంతో కొంత పర్వాలేదనిపించినా ఈ ఏడాది మరీ దారుణంగా అడ్మిషన్లు పడిపోయాయి. 547 సీట్లకు గాను 145 మంది ఎంపికయ్యారు.
- ఏపీ పీజీసెట్‌లో అర్హత మార్కులు పొందిన వారి సంఖ్య నామ మాత్రంగా ఉండటంతో పాటు డిగ్రీ పూర్తి అయిన వారు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల వైపు ఆసక్తి చూపుతుండటంతోనే పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పడిపోతున్నట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
- సీట్లు భర్తీ కానీ కోర్సుల స్థానంలో వృత్తి పరమైన, ఉపాధి కల్పించే కోర్సులు అందుబాటులోకి తెస్తే పీజీ పూర్తి అయిన తరువాత ఉపాఽధి అవకాశాలు దక్కుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు.
-
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)