Counselling for Engineering Students: ఆర్‌యూ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవ: కౌన్సెలింగ్ నిర్వహణ
Sakshi Education
కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఇటీవల జరిగిన ఒక దారుణ సంఘటన తర్వాత విశ్వవిద్యాలయం చర్యలు తీసుకుంటోంది. గత గురువారం అర్ధరాత్రి, కాలేజీ హాస్టల్‌లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సునీల్ అనే విద్యార్థిపై 15 మందికి పైగా సీనియర్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు.
ఈ సంఘటనపై విశ్వవిద్యాలయం తీవ్రంగా స్పందించింది. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు మరియు హాస్టల్స్ చీఫ్ వార్డెన్ ఆచార్య విశ్వనాథరెడ్డిలు బాధిత విద్యార్థి సునీల్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా, దాడి చేసిన సీనియర్ విద్యార్థులతో మాట్లాడి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిపించి వారి సమక్షంలో మరోసారి ఇంజినీరింగ్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు విద్యార్థుల నుండి హామీ తీసుకున్నారు. తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీధర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 21 Oct 2024 10:36AM