Free Online Training: ఏఐపై మరింత అవగాహన అవసరం.. ఉచిత శిక్షణకు ఒప్పందం
తెలంగాణలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆన్ లైన్ లో ఉచిత శిక్షణ అందించేందుకు టాస్క్ సంస్థతో మాటా ఒప్పందం కుదరచుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు.
హెదరాబాద్ మాసబ్ ట్యాంక్ టాస్క్ కార్యాలయంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, మాట ఫౌండర్ శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు.
మాట ఫౌండర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వారానికి నాలుగు క్లాస్‌లు, రోజుకు రెండు గంటలు పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని ఇది కంటిన్యూ ప్రాసెస్ అని ఆయన తెలిపారు తొలుత ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో ప్రారంభించిన ట్లు తెలిపారు 200 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మంచి స్పందన వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేసారు.
చదవండి: AICTE: సత్తా చాటేలా సిలబస్!
హైదరాబాద్ హెచ్‌ఐసిసి లో సెప్టెంబర్ 4 5 తేదీల్లో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
తెలంగాణలో అతిపెద్ద ఏఐ సిటిని 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రభుత్వం అన్నారు. నిరుద్యోగ యువతకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు ఐటీ కంపెనీలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Tags
- jayesh ranjan
- artificial intelligence
- Free Online Training
- Telangana IT
- TASK
- Telangana Academy for Skill and Knowledge
- Srikanth Sinha
- Srinivas
- MATA
- Unemployed Youth
- New Technology
- Artificial Intelligence Online Training
- JayeshRanjan
- AIawareness
- ArtificialIntelligence
- MATATaskAgreement
- FreeAITraining
- TelanganaYouth
- SakshiEducationUpdates