JNTUH VC Post: అర్హతలేని వ్యక్తికి జేఎన్‌టీయూహెచ్ వీసీ పోస్టు?

దక్షిణ తెలంగాణకు చెందిన ఆ మంత్రి ఒత్తిడి వల్లే అర్హత లేనప్పటికీ ఓ మాజీ ప్రొఫెసర్ పేరును కూడా జాబితాలో కమిటీ చేర్చిందని తెలియవచ్చింది. నెల రోజులుగా వీసీ పోస్టు కోసం ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి.. ఇందుకోసం మంత్రిని పలుమార్లు కలిసి భారీగా ఖర్చు చేసినట్లు సన్నిహితులతో చెప్పుకుంటుండటం ఉన్నతవిద్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.
చదవండి: 400 Jobs: LIC, SBI Life, MedPlusలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
సెర్చ్ కమిటీ భేటీకి ముందే తనకు వీసీ పోస్టు ఖాయమని చెప్పుకోవడం గమనార్హం. తొలుత ఈ పేరును సిఫార్సు చేసేందుకు సెర్చ్ కమిటీ ఇష్టపడలేదని సమాచారం. 2022లో జరిగిన ప్రవేశాల అవకతవకల్లో ఆయన ప్రమేయం ఉండటం, రిటైరయ్యాక చేరిన ఓ ప్రైవేటు వర్సిటీలోనూ అక్రమాలకు పాల్పడి ఉద్వాసనకు గురికావడంతో ఆ వ్యక్తిని ఎలా సిఫార్సు చేస్తామని కమిటీ అన్నట్లు తెలిసింది.
![]() ![]() |
![]() ![]() |
కానీ ఆయన్నే ఎంపిక చేయాలని మంత్రి పట్టుబట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన పేరును సైతం సిఫార్సు నివేదికలో చేర్చామని కమిటీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆయన్ను ఎంపిక చేస్తే వర్సిటీలో అవినీతి రాజ్యమేలుతుందని పలు విద్యాసంఘాల నేతలు, విద్యార్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.