Vocational Courses in Gurukul: గురుకులాల్లో వృత్తి విద్యా కోర్సులు.. జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి శిక్షణ!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: గురుకులాల్లో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని, స్టడీ సర్కిళ్లను ఉద్యోగ కల్పన కేంద్రాలుగా మార్చాలని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.

2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై ఫిబ్రవరి 14న సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గురుకులాల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి శిక్షణ ఇవ్వాలని, DSC, Banking వంటి పరీక్షలపైనా దృష్టి సారించాలన్నారు.
సమావేశంలో రవాణా, ఆర్థికశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్‌రాజ్, రామకృష్ణారావు, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, రవాణాశాఖ కమిషనర్ సురేంద్రమోహన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
![]() ![]() |
![]() ![]() |

Published date : 14 Feb 2025 03:47PM