Skip to main content

10th Class Exams Major Changes: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు.. మార్పులు ఇవే!

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పు తీసుకురానున్నారు.
Major Changes in Telangana 10th Class Public Exams

ఈసారి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఓఎంఆర్ (OMR) షీట్లను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు ఈ కొత్త విధానానికి అలవాటు పడేందుకు, మార్చి 6 నుండి ప్రారంభమయ్యే ప్రీ-ఫైనల్ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్ షీట్లను అందించనున్నారు. 

విద్యార్ధులకు అందించే ఈ ఓఎమ్‌ఆర్‌ పత్రాల్లో ప్రతి విద్యార్థి తనకు ఇచ్చిన ఆన్సర్‌ బుక్‌లెట్‌ సంఖ్యను రాయాల్సి ఉంటుంది. అలాగే దానిపై సంతకం కూడా చేయాలి. విద్యార్థికి సంబంధించిన ఇతర వివరాలు కూడా అందులో ముందుగానే ముద్రించి ఉంటాయి.

వాటిని విద్యార్థులు సరిచూసుకోవాలి. వివరాల్లో తప్పులున్నా.. ఆ ఓఎంఆర్‌ తనది కాకపోయినా.. విద్యార్ధులు వెంటనే ఇన్విజిలేటర్‌కు చెప్పాల్సి ఉంటుంది. అలాగే వారిచ్చే ఇతర నామినల్‌ రోల్‌ పత్రంలో సరైన వివరాలను రాయాల్సి ఉంటుంది.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల్లో ప్రతిరోజూ ఓఎంఆర్‌ పత్రాలను విద్యార్థులకు అందిస్తారు. నేరుగా పబ్లిక్‌ పరీక్షల్లో ఓఎంఆర్‌ పత్రాలను ఇవ్వడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది.

అందువల్ల కొందరు విద్యార్ధులు తప్పులు చేసే అవకాశం ఉంది. మరికొందరికి సమయం వృథా అయ్యే ఛాన్స్‌ ఉంది. దీన్ని నివారించేందుకు ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్‌ పత్రాలను ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. దీనివల్ల విద్యార్ధులకు కొంత సాధన అవుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Current Affairs
Published date : 13 Feb 2025 06:24PM

Photo Stories