OU Engg Gold Medal: ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమృత్ శివలెంక గోల్డ్ మెడల్
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో డాక్టర్ అమృత్ శివలెంక గోల్డ్ మెడల్ ను ప్రవేశ పెట్టారు.

ఓయూలో ఇంజినీరింగ్ పూర్తి చేసి అమెరికాలోని ఫ్లోరిడాలో ఓర్లాండ్ల యూనివర్సల్ స్టూడియోస్ లో పని చేస్తున్న ఆయన తన పేరు మీద గోల్డ్ మెడల్ కోసం రూ.5 లక్షలను అందచే శారు.
చదవండి: Engineering Seats: ఆన్‌లైన్‌లోనే యాజమాన్య కోటా భర్తీ.. కారణం ఇదే!
జనవరి 27న కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. చంద్రశేఖర్ కు డా. అమృత్ సోదరుడు కళ్యాణ్ శివలెంక రూ.5 లక్షల చెక్కు అందచేశారు. బీఈ మెకానికల్ ఇంజినీరింగ్ లో అత్యంత మార్కులు సాధించిన విద్యార్థికి డా. అమృత్ శివలెంక గోల్డ్ మెడల్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ.చంద్రశే ఖర్ పేర్కొన్నారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 29 Jan 2025 08:33AM