Skip to main content

Engg Fee Reimbursement: ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు.. ఈసారి ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, టెక్నికల్‌ కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Fee reimbursement arrears of engineering and Technical colleges  Engineering and technical college students in Hyderabad.

డిసెంబ‌ర్ 17న‌ సాయంత్రం సచివాలయంలో ప్రైవేట్‌ కళాశాలల యజమానులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని, అసెంబ్లీ సమావేశాల తదుపరి బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.

చదవండి: OET for Medical Professionals: మెడికల్ ప్రొఫెషనల్స్ కోసం ఓఈటీ

ప్రైవేట్‌ ఉన్నత విద్యాసంస్థలు మనుగడ సాగించాలంటే బకాయిల చెల్లింపు అనివార్యమని ప్రజాప్రభుత్వం ఆలోచన చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు దశలవారీగా చెల్లించాలని నిర్ణయించినట్టు యజమానులకు తెలిపారు. 

Published date : 18 Dec 2024 01:32PM

Photo Stories