Skip to main content

Inter Board: ఉత్తీర్ణత పెంచడమే లక్ష్యం!.. ఈ కాలేజీలకు ఇంటర్‌ బోర్డ్‌ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌లో ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించాలని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు ఆదేశించారు.
TGBIE Directions to Government Junior Colleges  Government junior colleges focus on improving Intermediate exam performance  Review meeting held by Inter Board officials on Intermediate results

ఆ దిశగా అన్ని కాలేజీల్లోనూ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందివ్వాలని సూచించారు. గురుకులాల్లో ఫలితాలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో ఇటీవల ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్‌ ఫలితాలపై అధికారులు సమీక్ష నిర్వహించి, అన్ని జిల్లాల ఇంటర్‌ విద్యాధికారుల నుంచి వివరణ కోరారు. ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించటంపై కార్యాచరణను నిర్దేంచారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

90 శాతం పాస్‌ సాధించిన కాలేజీలకు, అధ్యాపకులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థుల్లో జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపేవారికి ఈ ఏడాది నుంచి ప్రభుత్వ తోడ్పాటు ఉంటుందని అంటున్నారు. దీనిపై ఇప్పటికే అవసరమైన నివేదికలు సిద్ధం చేశామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

చదవండి: 85 KVS & 28 NVS List: కొత్తగా 85 కేవీలు, 28 ‘నవోదయ’లు.. జాబితా ఇదే..
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ను ఇప్పటి వరకూ ఆయా కాలేజీల్లోనే నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రైవేటు కాలేజీల్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ప్రాక్టికల్స్‌ పరీక్షలకు ప్రభుత్వ లెక్చరర్లే వెళ్లినా వారిని కాలేజీ యాజమాన్యాలు అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి జంబ్లింగ్‌ విధానం అనుసరించే ఆలోచన చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.   

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 18 Dec 2024 12:30PM

Photo Stories