Skip to main content

TS Inter Fee Payment Last Date 2024 : తెలంగాణ ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలు ఇవే.. మొత్తం ఫీజు ఎంతంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్ ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల ఫీజు చెల్లింపు తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఇంటర్ మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులకు (జనరల్‌) రూ.520 చెల్లించాలని బోర్డు తెలిపింది.
TS Inter Exam Fee 2024  Telangana Inter Board fee payment dates announcement  Telangana Inter Public Exam fee details Important dates for Telangana Inter exam fee payment

ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా... నవంబర్ 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. అలాగే ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు రూ.1000 అపరాధ రుసుంతో నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు చెల్లించవచ్చు.  డిసెంబ‌ర్ 19వ తేదీ నుంచి డిసెంబ‌ర్ 27వ తేదీ వ‌ర‌కు రూ.2000 అప‌రాధ రుసుంతో ఫీజు చెల్లించ వ‌చ్చును.

అలాగే ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం జ‌న‌ర‌ల్‌ విద్యార్థుల‌కు కూడా ప‌రీక్ష‌ల‌ ఫీజు రూ.520/- చెల్లించాల‌ని బోర్డ్ తెలిపింది. వోకేష‌న‌ల్ విద్యార్థుల‌కు రూ.750/- ఫీజుల చెల్లించాలి. తెలంగాణ‌లో ఇంట‌ర్ మొద‌టి . రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు మార్చి నెల రెండో లేదా మూడో వారం నుంచి జ‌రిగే అవ‌కాశం ఉంది.

తెలంగాణ ఇంట‌ర్ 1st, 2nd ఫీజుల వివ‌రాలు ఇవే..

Published date : 06 Nov 2024 08:48AM
PDF

Photo Stories