Intermediate Board: గుడ్‌న్యూస్.. రూ. 500 ఫీజు కడితే హాజరు మినహాయింపు
హాజరు మినహాయింపు పొందడానికి విద్యార్థులు నవంబర్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్‌లో సరైన హాజరుశాతం లేక పరీక్షలు రాయలేని వారు, వ్యక్తిగత లేదా అనారోగ్య కారణాలతో కాలేజీలకు వెళ్లని వారికి ఇదొక మంచి ఛాన్స్.
హాజరు శాతం తక్కువగా ఉన్నా పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అవకాశం కేవలం ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులకు మాత్రమే.మరింత సమాచారం కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి. విద్యార్థులు తమ పదో తరగతి ఒరిజినల్, టీసీ, ఇతర సర్టిఫికేట్స్‌ను అందులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కూడా ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాలి.పోస్టు ద్వారా పంపిన దరఖాస్తులను రిజెక్ట్ చేస్తారు.
Diploma Courses: పనిచేస్తూనే.. సాయంత్రాలు చదువుకోవచ్చు, డిప్లొమా కోర్సులకు చివరి తేదీ ఇదే
ఎవరెవరు అర్హులు?
10వ తరగతి పాసై ఏడాది గడిచిన అభ్యర్థులు నేరుగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, రెండేళ్లు గ్యాప్ ఉన్న వారు ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాయవచ్చు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి చదివిన వారు తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికెట్ జతపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా దరఖాస్తు సమయంలో వాటిని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
ఇంటర్ బైపీసీతో పరీక్షలు రాసిన విద్యార్థులు మేథమేటిక్స్ సబ్జెక్టును కూడా రాయాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. www.bie.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Elon Musk About College Education: ''జీవితంలో సక్సెస్ అయ్యేందుకు కాలేజీ డిగ్రీ అవసరం లేదు.. ఆ టైం అంతా వృథా''
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- Intermediate Board
- Intermediate Boards
- telangana intermediate board
- Supplementary Exams
- intermediate private students
- fee details
- exemption from attendance
- Telangana State Board of Intermediate Education
- Telangana inter board
- Telangana Intermediate Board News
- Intermediate Public Examinations
- Telangana Intermediate exams 2025
- Private inter exam opportunity
- Telangana board exam fee
- Late fee inter exams Telangana
- Telangana education board announcements
- SakshiEducationUpdates