Skip to main content

Kharif Crops: రికార్డు స్థాయిలో ఉన్న ఖరీఫ్ పంటల దిగుబడులు

2024-25 సంవత్సరంలో ఖరీఫ్ పంటల దిగుబడి రికార్డు స్థాయిలో ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనావేసింది.
India set to harvest record Kharif crops, estimates agriculture ministry  Union Agriculture Department Kharif crop yield prediction 2024

మొట్టమొదటిసారిగా, డిజిటల్ క్రాప్ సర్వేతో రూపొందించిన ఈ అంచనాలను ఆ శాఖ న‌వంబ‌ర్ 5వ తేదీ విడుదల చేసింది. 

దీని ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లో వరి దిగుబడి ఈసారి 217.43 (ఎల్ఎంటీ) లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఆ తర్వాతి స్థానాల్లో 146.82 ఎల్ఎంటీలతో పంజాబ్, 120.75 ఎల్ఎంటీతో పశ్చిమబెంగాల్, 98.08 ఎల్ఎంటీలతో చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ 81.74 ఎల్ఎంటీల వరి దిగుబడితో ఐదో స్థానంలో ఉంది. 

ఈ అంచనాల ప్రకారం.. 2024-25 ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల దిగుబడి 1647.05 ఎల్ఎంటీలుగా ఉంది. ఇది గతేడాది ఖరీఫ్ ఆహారధాన్యాల దిగుబడితో పోలిస్తే 89.37 ఎల్ఎంటీలు అధికం. వరి, జొన్న, మొక్కజొన్నల అధిక ఉత్పత్తి కారణంగా ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది.

Mudra Yojana: ముద్రా యోజన రుణ పరిమితి పెంపు.. ఎంతంటే..

Published date : 06 Nov 2024 03:58PM

Photo Stories