Mudra Yojana: ముద్రా యోజన రుణ పతిమితి రూ.20 లక్షలకు పెంపు
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా ముద్రా రుణాల పరిమితిని ప్రస్తుతమున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
దీని ప్రకారం.. గతంలో తరుణ్ కేటగిరీ కింద రుణాలను తీసుకుని, పూర్తిగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు కొత్తగా తరుణ్ ప్లస్ అనే కేటగిరీని తీసుకువచ్చారు. దీనిలో గరిష్ట రుణ పరిమితిని రూ.20 లక్షలుగా నిర్ణయించారు. పథకం లక్ష్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పెంపు దోహదపడుతుందని పేర్కొంది. ఈ రుణాలకు హామీ కవరేజీని క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్(CJFMU) కింద అందజేస్తారు.
Amaravati Railway Line: అమరావతి రైల్వేలైన్‌కు కేంద్రం ఆమోదం
ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY).. అనేది కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు అందించడం కోసం 2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ రుణాలను పీఎంఏవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించారు. ఈ లోన్స్ మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లు అందిస్తారు.
ఇది చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రుణాలను అందించడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ లోన్స్ పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం, తయారీ, వ్యాపారాలు వంటి అనేక రంగాలలో ఉపయోగపడతాయి.
ప్రభుత్వం ఈ రుణాలను బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మరియు మైక్రో-ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ వంటి సభ్యుల ద్వారా అందిస్తుంది, దీనివల్ల వ్యాపారవేత్తలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మరింత అవకాశం ఉంది.
Venture Capital Fund: అంతరిక్ష రంగంలో అంకుర పరిశ్రమలకు రూ.1,000 కోట్లు