Skip to main content

Space Sector Startups: అంతరిక్ష రంగంలో అంకుర పరిశ్రమలకు రూ.1,000 కోట్లు

అంతరిక్ష రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం రూ.1,000 కోట్లతో వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
Union Cabinet Approves Rs 1,000 Crore Venture Capital Fund for Space Startups

ప్రధాని న‌రేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అక్టోబ‌ర్ 24వ తేదీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ భేటీ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. 

ఈ ఫండ్ ద్వారా దాదాపు 35 స్టార్టప్‌లకు మద్దతు అందించబడే అవకాశం ఉంది. దీనివల్ల అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పేస్‌ టెక్నాలజీలో ఆధునిక పరిశోధనలతోపాటు అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యంతో భారత్‌ నాయకత్వం బలోపేతం కావడానికి ఈ నిధి దోహదపడతుందని చెబుతున్నారు. 

Coromandel: కోరమాండల్‌ ఇంటర్నేషనల్ రూ.800 కోట్ల పెట్టుబడి

ఈ నిధి నుంచి అర్హత కలిగిన స్టార్టప్‌ల్లో రెండు దశల్లో పెట్టుబడులు పెడతారు. మొదటి దశలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు, రెండో దశలో రూ.10 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో 57 కిలోమీటర్ల నూతన రైలు మార్గంతోపాటు, ఉత్తర బిహార్‌లో 256 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ డబ్లింగ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల విలువ రూ. 6,798 కోట్లు. ఇందులో అమరావతిలో రైల్వే లైన్‌కు రూ.2,245 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Nuclear Submarine: భారత అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి

Published date : 25 Oct 2024 04:09PM

Photo Stories