Skip to main content

AP Inter Syllabus Changes 2024 : ఇంటర్ సిలబస్‌, పరీక్షల విధానంలో భారీగా మార్పులు.. ఇకపై బోర్డ్ ప‌రీక్ష‌లు లేన‌ట్టే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంటర్‌ విద్యామండలి ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్ష‌ల విధానంలో భారీ మార్పులు చేయ‌నుంది. ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో పోల్చితే రాష్ట్ర బోర్డు సిలబస్ ఎక్కువగా ఉందని.. దీనికి కొంత మేర తగ్గించాలని బోర్డు భావిస్తోంది.
AP Inter Syllabus Changes 2024

గణితం సబ్జెక్టులో కొంత‌ మేర భారం తగ్గించనున్నారు. ప్రస్తుతం గణితం రెండు పేపర్లుగా ఉంది. సిలబస్ తగ్గించాక రెండు పేపర్లను కొనసాగించాలా.. లేక ఒక్క పేపరు ఉంచాలా అదే దాని పైన ఆలోచన చేస్తోంది.  

ఇక బైపీసీలో మార్పులు ఇలా..
బైపీసీకి సంబంధించి.. ఎన్సీఈఆర్టీలో జీవశాస్త్రం ఒక్కటే ఉంది. ఏపీ ఇంట‌ర్‌లో బాటనీ, జీవశాస్త్రం సబ్జెక్టులు విడి విడిగా ఉన్నాయి. వీటి విషయం పైనా కసరత్తు జరుగుతోంది. సీబీఎస్ఈలో 11వ తరగతి బోర్డు పరీక్ష లేదు. అంతర్గత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని రాష్ట్ర బోర్డులోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే అంశం పైన అధ్యయనం చేస్తున్నారు. విద్యార్ధుల పై ఒత్తిడి తగ్గుతుందా అనే అంశం పరిశీలిస్తోంది. ఇంటర్మీడియట్‌లో జనరల్ సబ్జెక్టులతో పాటుగా ఎలక్టివ్‌గా స్కిల్ డెవలప్ మెంట్, వొకేషనల్ సబ్జెక్టులను ప్రవేశ పెట్టాలని ఆలోచన చేస్తోంది. ఈ మేర‌కు కసరత్తు చేస్తున్నారు ఇంట‌ర్ అధికారులు.

☛➤ AP Open School Inter Admissions : ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియట్‌లో నూత‌న విద్యాసంవ‌త్స‌ర ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

తుది నిర్ణయం తీసుకోవటం ద్వారా.. 
వచ్చే విద్యా సంవ్సతరం నుంచి ఈ నూతన ప్రతిపాదనలు అమలయ్యేలా ఆలోచన జరుగుతోంది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచనుంది. వీటి పైన ఉన్నత విద్యాశాఖ చర్చించి తుది నిర్ణయం తీసుకోవటం ద్వారా నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ మొత్తం కసరత్తు పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ మార్పుల పైన కళాశాల యాజమాన్యాలతో పాటుగా తల్లిదండ్రులు, విద్యార్దుల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ మొత్తం కసరత్తు.. వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక రూపంతో తమ ప్రతిపాదనలను సమర్పించనుంది. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో సమీక్షించిన తరువాత అమలు పైన తుది నిర్ణయం తీసుకోనుంది.

☛➤ Open Tenth Admissions : ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతిలో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు.. వీరే అర్హులు..

Published date : 19 Aug 2024 03:11PM

Photo Stories