Skip to main content

School Holidays: నేడు విద్యాసంస్థలకు సెలవు... పరీక్షలు వాయిదా!

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెప్టెంబర్ 2న‌ సెలవు ప్రకటించింది.
Schools affected by heavy rains and government holiday announcement  District education officers report school conditions to collectors  Collectors advised to make decisions based on local weather conditions   Today is a holiday for educational institutions news in telugu  Government announcement for educational institution holiday due to heavy rains Instruction for school closures issued by the government

పరిస్థితిని బట్టి ఆ తర్వాత తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో వాస్తవ పరిస్థితిని డీఈవోలు పలు జిల్లాల్లో కలెక్టర్లకు వివరించారు.

నేడు విద్యాసంస్థలకు సెలవు

పిల్లలు పాఠశాలలకు వచ్చే పరిస్థితి లేదని, పాఠశాలల ప్రాంగణాలు వరద నీటితో నిండిపోయాయని, కొన్ని పాఠశాల భవనాలు కురుస్తున్నాయని, ఇక శిథిలావస్థలో ఉన్న భవనాల్లో తరగతులు నిర్వహించలేని పరిస్థితి ఉందని తెలిపారు.

చదవండి: Teachers Transfer: టీచర్ల బదిలీల్లో దారుణం మండి పడుతున్న ఉపాధ్యాయులు

పలు చోట్ల వాగులు పొంగుతున్నాయని, రహదారుల్లో వెళ్లలేని పరిస్థితి ఉందని డీఈవోలు తమ నివేదికల్లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని సెప్టెంబర్ 2న‌ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇంకా వర్షాలు కురిస్తే మంగళవారం స్కూళ్లు తెరవాలా? లేదా? అనేది ఆలోచిస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

పరీక్షలు వాయిదా!

మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 2న‌ జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటించారు. 3వ తేదీన జరగాల్సిన పలు పరీక్షలు యథావిధిగా ఉంటాయని తెలిపారు.  

Published date : 02 Sep 2024 11:41AM

Photo Stories