34 Short Term Courses: స్వల్పకాలిక కోర్సులకు అనుమతి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తక్షణ ఉపాధి లభించే స్వల్పకాలిక ఒకేషనల్ సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించే కాలేజీలు, సంస్థలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ యాజమాన్యాలను కోరారు.
ఇంటర్ చదువుతున్న, మధ్యలో మానేసిన, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు మొత్తం 34 కోర్సులను అందిస్తున్నారు.
ఆరు నెలలు, ఏడాది కాలపరిమితి గల ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి వివిధ పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ నిర్వహించే కోర్సులకు అవసరమైన అర్హతలతో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ విద్య కమిషనర్ సూచించారు.
చదవండి: Half Day for Schools: ఒక్క పూటే ప్రాథమిక పాఠశాలలు.. కారణం ఇదే..
కనిష్టంగా రెండు కోర్సులు, గరిష్టంగా తొమ్మిది కోర్సుల నిర్వహణకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఫీజుల వివరాలను కూడా అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 07 Nov 2024 12:30PM