Skip to main content

Supreme Court Help for Student: విద్యార్థికి సాయపడేందుకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు

ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్లోని పేద విద్యార్థికి ఇంజనీరింగ్ సీటు ఖరారులో సాయపడేందుకు సుప్రీంకోర్టు ముందుకొచ్చింది.
Supreme Court came forward to help the student

చదువుల్లో మేటి అయిన దళిత పేద విద్యార్థి అతుల్ కుమార్ కష్టపడి చదివి జేఈఈ అడ్వాన్స్డ్ పరీ క్షలో మంచి ర్యాంక్ సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్ కాలేజీలో ఎల క్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సీటు సాధించాడు. అయితే సీటును ఖరారుచేసుకు నేందుకు తొలుత రూ.17,500 జూన్ 24వ తేదీన సాయంత్రం ఐదింటికల్లా చెల్లించాలి.

టిటోరా గ్రామంలో వీళ్లది నిరుపేద కుటుంబం. దీంతో సమయా నికి అంత డబ్బు జమచేయలేకపోయారు. చిట్టచివరికి అప్పులు చేసి ఆన్లై న్లో నాలుగు నిమిషాల ముందు చెల్లింపు చేయబోతే చెల్లింపు సాధ్యపడ లేదు. గడువులోపు ఫీజు చెల్లించలేకపోయాడు.

చదవండి: Annual Convocation: ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ 32వ స్నాతకోత్సవం.. దయాగుణం కలిగి ఉండమ‌ని చెప్పిన చంద్రచూడ్‌

దీంతో తొలుత జార్ఖండ్ హైకో ర్టును ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృ త్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. “ఈ విషయంలో మేం సాయంచేస్తాం'అని హామీ ఇచ్చింది. ఐఐటీ మద్రాసు కోర్టు నోటీసులు జారీచేసింది. కేసు తదుపరి విచారణ సెప్టెంబ‌ర్ 30వ తేదీకి వాయిదా వేసింది.

అతుల్ సోదరులు కూడా చదువుల్లో మేటి. మంచి ర్యాంకులతో ఒకరు ఐఐటీ ఖరగ్ పూర్, మరొకరు ఎస్ఐటీ హమీర్పూర్ లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. అప్పులుచేసి మరీ చదివిస్తున్నామని వీళ్ల తల్లిదండ్రులు తెలిపారు.

Published date : 27 Sep 2024 01:14PM

Photo Stories