Skip to main content

Supreme Court Judge : సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు.. అంద‌రినీ స‌మానంగా చూడాలి..

ఐఏఎస్‌ అధికారులు ఎప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు.
Supreme court judges comments on supremacy of ias officers on ips and ifs

న్యూఢిల్లీ: ఐఏఎస్‌ అధికారులు ఎప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. అందుకే ఐఏఎస్‌ల మాట మేం ఎందుకు వినాలనే అసహనం, అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల్లో గూడుకట్టుకుపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక కేసును జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అటవీ అధికారులు తమ ఆదేశాలను పాటించాలని ఐఏఎస్‌ అధికారులు కోరడంపై ధర్మాసనం విస్త్రృతంగా చర్చించింది.

Dolphins: డాల్ఫిన్లు ఎక్కువ ఉన్న‌ది ఈ రాష్ట్రాల్లోనే..

ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శ‌న‌..

ఇండియన్‌ అడ్మిస్ట్రేటివ్‌ సర్వీసెస్, ఇండియన్‌ పోలీస్‌ సర్వీసెస్, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ అధికారుల మధ్య జరుగుతున్న ఈర్ష్య‌ యుద్దాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్‌ గవాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లకు ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లకు మధ్య బేదాభిప్రాయాలు లేవని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వాదనను జడ్జి తప్పుబట్టారు.

Vantara Rescue Centre: 'వంతారా'ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

‘‘నేను ప్రభుత్వ న్యాయవాదిగా మూడేళ్లు పనిచేశా. న్యాయమూర్తిగా 22 ఏళ్లుగా సేవలందిస్తున్నా. ఇన్నేళ్లలో నేను గమనించింది ఏంటంటే ఐఏఎస్‌లు ఎప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తుంటారు. 

విధానం మారాలి..

ఈ వివాదం అన్ని రాష్ట్రాల్లో ఉంది. అందరూ ఒకే అఖిల భారత సర్వీస్‌లకు సంబంధించిన ఉన్నతాధికారులమే అయినప్పుడు ఐఎఎస్‌ల మాటే ఎందుకు వినాలి? అనే అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లలో ఉంది. ఈ విధానం మారాలి. ఈ విషయంలో అందర్నీ సమానంగా చూడాలని భావన ఐఏఎస్‌లలో కల్పించండి’’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు జస్టిస్‌ గవాయ్‌ సూచించారు. అధికారుల మధ్య ఉన్న అంతర్గత వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని కేంద్రం తరఫున తుషార్‌ కోర్టుకు తెలిపారు. జడ్జీలు కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదావేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Mar 2025 03:29PM

Photo Stories