Skip to main content

AI Jobs: కండక్టర్ ఉద్యోగానికీ ఏఐ.. ఏఐ ద్వారా పెరిగే ఉద్యోగాలు ఇవే!

సాక్షి ఎడ్యుకేషన్: ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల విడుదల చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ – 2025’ పలు ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది.
Futur AI jobs   Artificial Intelligence transforming job opportunities by 2030

కిందిస్థాయి ఉద్యోగాల్లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రవేశించడంతో, 2030 నాటికి కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయని, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2030 నాటికి బస్ కండక్టర్‌ వంటి ఉద్యోగాలకు కూడా AI పరిజ్ఞానం అవసరం అవుతుందని, వ్యవసాయం వంటి రంగాల్లో కూడా AI ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.

చదవండి: AI Jobs: భారత్‌కు ఏఐ నిపుణులు కావలెను.. 23 లక్షల ఉద్యోగ అవకాశాలు

భారత్‌లో AI నైపుణ్యాల పెరుగుదల

2023లో సేకరించిన లెక్కల ప్రకారం, భారత్‌లో కేవలం 4.16 లక్షల మంది AI నిపుణులు మాత్రమే ఉన్నారు. అయితే 2025 నాటికి 6.29 లక్షలు మరియు 2026 నాటికి 10 లక్షల మంది AI నిపుణులు అవసరం అని అంచనా వేయబడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంప్యూటర్ కోర్సుల్లో సిలబస్ మార్పులు చేసి, AI ఆధారిత పరిశ్రమల సహకారంతో సిలబస్ రూపకల్పన చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ యూనివర్శిటీలు ఈ మార్గంలో ముందుకు సాగుతున్నాయి. అమెరికాలో స్కూల్ స్థాయి నుంచే AI బోధన ప్రారంభమైంది. భారత్ కూడా ఈ దిశగా పయనించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

2030 నాటికి AI ద్వారా పెరిగే ఉద్యోగాలు (శాతం):

  • డేటా స్పెషలిస్టులు: 110%
  • ఫిన్‌టెక్ ఇంజనీర్లు: 95%
  • AI మెషిన్ లెర్నింగ్ నిపుణులు: 80%
  • సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలపర్స్: 60%
  • సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ నిపుణులు: 57%
  • డేటా వేర్‌హౌసింగ్ నిపుణులు: 48%
  • ఎలక్ట్రిక్ వెహికిల్ స్పెషలిస్టులు: 45%
  • UI & UX డిజైనర్స్: 43%
  • డెలివరీ సర్వీస్ డ్రైవర్స్: 42%
  • Internet of Things (IoT) స్పెషలిస్టులు: 41%
  • డేటా అనలిస్ట్ నిపుణులు: 40%
  • ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లు: 39%
  • ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టులు: 38%
  • డెవాప్స్ ఇంజనీర్లు: 37%
  • రిన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీర్లు: 38%
Published date : 28 Mar 2025 03:20PM

Photo Stories