Skip to main content

Online Training: డేటా సైన్స్, బిగ్‌ డేటా, ఏఐ సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్షణ

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ స్కిల్‌ అకాడమీ (ఎన్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆమో దిత డేటా సైన్స్, బిగ్‌ డేటా, ఏఐ సాఫ్ట్‌వేర్‌ కోర్సు ల్లో ఆన్‌లైన్‌ విధానంలో శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ ఎస్‌ఏ ప్రోగ్రాం డైరెక్టర్‌ అక్టోబర్ 1న‌ ఒక ప్రకట నలో వెల్లడించారు.
Online training in Data Science and AI software courses news in telugu

వీటితోపాటు 100కి పైగా కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ కోసం రాష్త్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.

చదవండి: Online AI Courses: ఏఐ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఎథికల్‌ హ్యాకింగ్, పైథాన్, మెషీన్‌ లెర్నింగ్, బిజినెస్‌ అనలిటిక్స్, ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్‌ లెర్నింగ్, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, వెబ్‌ డిజైన్‌ మొదలైన కోర్సులలో అర్హతను బట్టి ఎంపిక చేసుకోవచ్చునని తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు, దివ్యాంగులు, మాజీ సైనికులు, వారి పిల్లలకు స్వర్ణ భారత్‌ జాతీయస్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 80% మేర ఫీజు రాయితీ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు  www.nationalskillacademy.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ఇతర వివరాలకు 9505800050, 9505800047 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చునని తెలిపారు.

Published date : 02 Oct 2024 03:44PM

Photo Stories