Skip to main content

Placements: టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌.. వీటిలో ప్రవేశం పొందితే కోర్సు చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే.. క్యాంపస్‌ ఆఫర్లు!

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు.. సాంకేతిక విద్యా బోధనలో ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్స్‌! వీటిలో ప్రవేశం పొందితే కోర్సు చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే.. క్యాంపస్‌ ఆఫర్లు అందుకోవచ్చు. సర్టిఫికెట్‌ చేతికొచ్చే సమయానికి కార్పొరేట్‌ కొలువులో కుదురుకోవచ్చనే అభిప్రాయం!! తాజాగా 2024–25 బ్యాచ్‌కు సంబంధించి ఐఐటీలు, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో.. క్యాంపస్‌ డ్రైవ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది క్యాంపస్‌ నియామకాల్లో సానుకూల పరిస్థితి ¯ð లకొంది. విద్యార్థులకు ఆకర్షణీయ ఆఫర్లు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో క్యాంపస్‌ డ్రైవ్స్, పే ప్యాకేజ్‌లు, టాప్‌ రిక్రూటర్స్, కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలు తదితర వివరాలు...
IIT Campus Placements   Campus recruitment in India

గతేడాది అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా.. క్యాంపస్‌ డ్రైవ్స్‌లో కొంత మందగమనం కనిపించింది. ఈ ఏడాది 2024–25 బ్యాచ్‌ విద్యార్థులకు అలాంటి ఆందోళన లేదు. ఇప్పటి వరకు కొనసాగిన డ్రైవ్స్‌లో.. అన్ని క్యాంపస్‌ల్లో ఆఫర్లు ఆశావహంగా ఉన్నట్లు ప్లేస్‌మెంట్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఐఐటీ ఢిల్లీలో రూ.2.4 కోట్ల ప్యాకేజ్‌

  • ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌ డ్రైవ్‌ తొలిదశలో రూ.2.4 కోట్ల ఆఫర్‌ అత్యధిక పే ప్యాకేజ్‌గా నిలిచింది. అంతర్జాతీయంగా పేరు గడించిన ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఈ ఆఫర్‌ను అందించినట్లు తెలుస్తోంది. ఈ క్యాంపస్‌లో మొత్తం 1,200 మంది విద్యార్థులు క్యాంపస్‌ డ్రైవ్స్‌కు నమోదు చేసుకోగా.. 95 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి.
  • ఐఐటీ కాన్పూర్‌లో తొలిదశ క్యాంపస్‌ డ్రైవ్స్‌లో 1,109 మందికి ఆఫర్లు అందాయి. ఈ క్యాంపస్‌లో కూడా గరిష్ట వేతనం రూ.1.9 కోట్లుగా నమోదైంది. అదే విధంగా సగటు వేతనం రూ.24 లక్షలుగా ఉంది. 
  • ఐఐటీ ఖరగ్‌పూర్‌ క్యాంపస్‌లో రూ.2.14 కోట్ల పే ప్యాకేజ్‌తో ఆఫర్‌ లభించింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో 2024–25 బ్యాచ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌తో కలిపి మొత్తం 800 మందికి ఆఫర్లు దక్కాయి.
  • ఐఐటీ ముంబైలో అత్యధిక ప్యాకేజ్‌ రూ.2.2 కోట్లుగా నమోదైంది. సగటు వేతనం రూ.23.5 లక్షలుగా ఉంది.
  • ఐఐటీ–చెన్నైలో రికార్డ్‌ స్థాయిలో రూ.4.3 కోట్ల ప్యాకేజ్‌తో ఆఫర్‌ లభించింది. అదే విధంగా మరో పది మంది విద్యార్థులకు రూ.1.4 కోట్లకు పైగా ప్యాకేజ్‌తో ఆఫర్లు దక్కాయి. 
  • ఐఐటీ రూర్కీ క్యాంపస్‌లో అత్యధిక వేతనం రూ.3.67 కోట్లుగా నమోదైంది. సగటు వేతనం రూ.23.5 లక్షలుగా ఉంది. 
  • ఐఐటీ–హైదరాబాద్, భువనేశ్వర్, రోపార్, మండిలలోనూ రూ.1.5 కోట్లు గరిష్ట వేతనంగా ఉందని, సగటు వేతనం రూ.22.5 లక్షలుగా నమోదైందని ఆయా ప్లేస్‌మెంట్‌ సెల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఎన్‌ఐటీల్లోనూ అదే హవా

  • ఐఐటీల తర్వాత ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌ ఎన్‌ఐటీ క్యాంపస్‌లలోనూ ఈ ఏడాది క్యాంపస్‌ ఆఫర్లు ఆశాజనకంగా, పే ప్యాకేజ్‌లు ఆకర్షణీయంగా ఉన్నట్లు సమాచారం.
  • నిట్‌–జలంధర్‌లో అత్యధిక వేతనం రూ.52 లక్షలుగా నమోదైంది. ఊ    నిట్‌–జైపూర్‌లో అత్యధిక వేతనం రూ.64 లక్షలుగా నమోదైంది. సగటు వేతనం రూ.13.9 లక్షలుగా ఉంది. 
  • నిట్‌–కురుక్షేత్ర క్యాంపస్‌లో సైతం గరిష్ట వేతనం రూ.61 లక్షలు కాగా సగటు వేతనం రూ.19.7 లక్షలుగా ఉంది.
  • పలు నిట్‌ క్యాంపస్‌లలో క్యాంపస్‌ డ్రైవ్స్‌ ప్రక్రి­య ఇంకా కొనసాగుతోందని..ఫిబ్రవరి మొదటి వారానికి ఆఫర్లు,ప్యాకేజ్‌లపై స్పష్టత వస్తుందని ప్లేస్‌మెంట్‌ సెల్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ట్రిపుల్‌ ఐటీల జోరు

ట్రిపుల్‌ ఐటీలలోనూ ఈ ఏడాది క్యాంపస్‌ ఆఫర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు నమోదైన గణాంకాల ప్రకారం–ట్రిపుల్‌ ఐటీ ఢిల్లీలో రూ.­49 లక్షల గరిష్ట వేతనం నమోదైంది. ట్రిపుల్‌ ఐటీ డీఎం–కాంచీపురంలో అత్యధిక వేతనం రూ.32 లక్షలుగా, సగటు వేతనం రూ.12 లక్షలుగా ఉంది. ట్రిపుల్‌ ఐటీ లక్నోలో గరిష్ట వేతనం రూ.59 లక్షలుగా, సగటు వేతనం రూ.22.10 లక్షలుగా ఉంది. ట్రిపుల్‌ ఐటీ అలహాబాద్‌లో అత్యధిక వేతనం రూ.1.21 కోట్లుగా..సగటు వేతనం రూ.25.78 లక్షలుగా నమోదైంది. 

చదవండి: JEE Main 2024: జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానం.. సబ్జెక్ట్‌ వారీగా ముఖ్యమైన టాపిక్స్‌..

డిమాండింగ్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌

ఏఐ ఇంజనీర్, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్స్, సైబర్‌ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్, డేటా సైంటిస్ట్స్, అల్గారిథమ్‌ ఇంజనీర్స్, ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్, డేటా ఇంజనీర్, డేటా లాంగ్వేజ్‌ ఎక్స్‌పర్ట్, ప్రొడక్ట్‌ మేనేజర్‌ వంటి పోస్ట్‌లకు డిమాండ్‌ నెలకొంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ట్రేడింగ్‌ కంపెనీలు, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్‌ సంస్థలు, ఐటీ కంపెనీల నుంచి ఈ ఆఫర్లు లభించాయి.

టాప్‌ రిక్రూటర్స్‌

క్యాంపస్‌ డ్రైవ్స్‌లో క్వాల్‌కామ్, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్, బార్‌క్లేస్, గ్రావిటేషన్‌ రీసెర్చ్, ఇంటెల్‌ ఇండియా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్, గూగుల్, మైక్రాన్‌ టెక్నాలజీ వంటి అంతర్జాతీయ కంపెనీలతోపాటు బీపీసీఎస్, ఎన్‌పీసీఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సైతం టాప్‌ రిక్రూటర్లుగా నిలిచాయి. 

చదవండి: Career in ISRO: అంతరిక్ష పరిశోధన సంస్థలో కెరీర్‌కు మార్గాలు

స్కిల్స్‌ ఉంటేనే

కంపెనీలు కోడింగ్‌ నైపుణ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. రిటెన్‌ టెస్ట్‌లు, టెక్నికల్‌ రౌండ్స్‌లో కోడింగ్‌ సంబంధిత స్కిల్స్‌ను పరిశీలించాయని ప్లేస్‌మెంట్‌ వర్గాలు పేర్కొన్నాయి. కోర్‌ ఇంజనీరింగ్, సర్క్యూట్‌ బ్రాంచ్‌లకు సంబంధించి ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ ప్రమేయాలు, వాటిలో విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించాయని తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

కోర్‌ సెక్టార్‌.. ఓకే

ఈ ఏడాది కోర్‌ సెక్టార్‌లో సైతం నియామకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఆటోమొబైల్, తయారీ, ఎలక్ట్రానిక్స్‌ విభాగాలకు సంబంధించిన పలు సంస్థలు ప్లేస్‌మెంట్స్‌ డ్రైవ్స్‌కు వచ్చాయి. సర్వీస్‌ సెక్టార్‌ నుంచి ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ నుంచి పలు సంస్థలు క్యాంపస్‌ డ్రైవ్స్‌ చేపట్టాయి.

ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐటీలకు దీటుగా రాణిస్తోంది.. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌.
ఈ ఇన్‌స్టిట్యూట్‌ అనుసరిస్తున్న బోధన, అభ్యసన విధానాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. నిరంతరం లేబొరేటరీలు, రీసెర్చ్‌లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ.. ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ కల్పిస్తూ.. లెర్నింగ్‌ బై డూయింగ్‌ విధానాన్ని ట్రిపుల్‌ ఐటీ ,హైదరాబాద్‌ అనుసరిస్తోంది. 

ప్లేస్‌మెంట్స్‌ హవా

  • ఊ    ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లో బీటెక్, ఎంటెక్‌ విద్యార్థులకు నూటికి నూరు శాతం మందికి ఆఫర్లు దక్కుతున్నాయి. ఈ ఏడాది అత్యధిక వేతనం రూ. 65 లక్షలు కాగా సగటు వేతనం రూ.31.49 లక్షలు­గా ఉంది. సీఎస్‌ఈ బ్రాంచ్‌ విద్యార్థులకు రూ. 65 లక్షలు, ఈసీఈ బ్రాంచ్‌ విద్యార్థులకు రూ. 55.60 లక్షలతో అత్యధిక వార్షిక వేతనం లభించింది. 
  • ఊ    గత మూడేళ్లలో ఇదే రీతిలో ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌లో ఆకర్షణీయ స్థాయిలో ప్లేస్‌మెంట్స్‌ నమోదయ్యాయి. 2023లో 349 మంది విద్యార్థులకు గాను 341 మందికి ఆఫర్లు లభించగా.. అత్యధిక వేతనం రూ.1.02 కోట్లుగా, సగటు వేతనం రూ.23.43 లక్షలుగా నమోదైంది. 2022లో బీటెక్‌ సీఎస్‌ఈ విద్యార్థులకు అత్యధిక వేతనం రూ.74 లక్షలు కాగా, సగటు వేతనం రూ.31 లక్షలుగా ఉంది. 

బీటెక్‌తోపాటు మరెన్నో

బీటెక్‌ సీఎస్‌ఈ, బీటెక్‌ ఈసీఈతోపాటు బీటెక్‌ అండ్‌ ఎంఎస్‌ బై రీసెర్చ్‌ పేరుతో అయిదేళ్ల వ్యవధిలో డ్యూయల్‌ డిగ్రీ కోర్సులనూ ఈ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫర్‌ చేస్తోంది. అదేవిధంగా లేటరల్‌ ఎంట్రీ విధానంలోనూ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. పీజీ స్థాయిలో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్‌ పద్ధతిలో ఎంఎస్‌ బై రీసెర్చ్, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి.

ప్రవేశాలు ఇలా

ఈ ఇన్‌స్టిట్యూట్‌ అందిస్తున్న బీటెక్, ఎంటెక్, ఎంఎస్‌ బై రీసెర్చ్‌ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నారు. బీటెక్‌ కోర్సులకు జేఈఈ మెయిన్‌ మార్కుల ఆధారంగా అడ్మిషన్‌ లభిస్తుంది. దీంతోపాటు అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌(యూజీఈఈ) పేరుతో ఇన్‌స్టిట్యూట్‌ సొంత ప్రవేశ పరీక్ష నిర్వహించి.. బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. మరో విధానంలో ఇన్ఫర్మాటిక్స్, మ్యాథమెటిక్స్, సైన్స్, లింగ్విస్టిక్స్‌ ఒలింపియాడ్స్‌లో విజేతలు సైతం అడ్మిషన్‌ పొందొచ్చు. ప్రవాస భారతీయ విద్యార్థులకు డైరెక్ట్‌ అడ్మిషన్స్‌ ఫర్‌ స్టూడెంట్స్‌ అబ్రాడ్‌ విధానంలో ప్రవేశం కల్పిస్తారు. పీజీ కోర్సులకు ఇన్‌స్టిట్యూట్‌ సొంతంగా నిర్వహించే పీజీ ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. 

Published date : 21 Jan 2025 09:46AM

Photo Stories