ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు పోస్టింగులు.. సీనియారిటీ మాత్రం ఇలా!

గత ఏడాది ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన ఈ 44 మందిని సర్కిల్స్ సిబ్బందిగా నోటిఫై చేసింది. వారిని పలు శాఖల్లో నియమిస్తూ ఆర్థిక శాఖ ఫిబ్రవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది. వీరు గతంలో ఏపీలో పనిచేసిన ప్రభుత్వ శాఖల్లోనే తెలంగాణలోనూ పోస్టిం గులు ఇచ్చారు.
చదవండి: APPSC Group 1 Mainsలో మెరవాలంటే.. అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహాలు ఇవే!
వారి సీనియారిటీని కూడా నిర్ధారించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో ఆయా శాఖల్లో వారివారి హోదాల్లో పనిచేస్తున్న వారి కంటే చివరి స్థానంలో వీరి సీనియారిటీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా వీరి అంతర్గత సీనియారిటీ వారి ఒరిజినల్ సీనియారిటీ ప్రకారం వర్తిస్తుందని తెలిపారు.
![]() ![]() |
![]() ![]() |
ఈ 44 మంది ఉద్యోగుల్లో ఆఫీస్ సూపరింటెండెంట్, సూపరింటెండెంట్, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిని రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, నీటిపారుదల, హోం, పశు సంవర్ధక తదితర శాఖలకు పంపారు. వీరిని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని ఆయా విశాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు.