APPSC Group 1 Mainsలో మెరవాలంటే.. అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహాలు ఇవే!

- 81 ఏపీపీఎస్సీ గ్రూప్–1 మొత్తం పోస్ట్‌లు.
- 4,496 ప్రిలిమ్స్‌లో విజయం
- సాధించి మెయిన్స్‌కు అర్హత పొందిన వారు.
- 91,163 గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైనవారి సంఖ్య.
- అంటే.. వేలల్లో పోటీ ఉన్న ప్రిలిమ్స్‌లో విజయం సాధించి, 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు.. ఇందులో సత్తా చాటితేనే తదుపరి దశ ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది.
మే 3 నుంచి పరీక్షలు
ఏపీపీఎస్సీ తాజా ప్రకటన ప్రకారం– మే 3వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నారు. అంటే ఇప్పటి నుంచి అభ్యర్థు లకు అందుబాటులో ఉన్న సమయం దాదాపు రెండున్నర నెలలు. ఈ సమయాన్ని సద్విని యోగం చేసుకుంటే 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసే ఇంటర్వ్యూ దశకు చేరుకునే అవకాశం లభిస్తుంది.
అయిదు పేపర్లలో స్కోరే కీలకం
గ్రూప్–1 మెయిన్స్‌ను మొత్తం ఏడు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఇందులో తొలి రెండు పేపర్లు (తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్) అర్హత పేపర్లు మాత్రమే. వీటిలో అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధిస్తేనే పేపర్–1 నుంచి పేపర్–5 వరకు మూల్యాంకన చేస్తారు. లాంగ్వేజ్ పేపర్లలో
ఓసీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి.
పేపర్–1 జనరల్ ఎస్సే
ఈ పేపర్‌లో సమకాలీన అంశాలపై మూడు వ్యాసా లు రాయాల్సి ఉంటుంది. ఇందులో రాణించాలంటే.. అభ్యర్థులు తాజా పరిణామాలపై పూర్తి స్థాయి అవగాహనతోపాటు విశ్లేషణ, స్వీయ అభిప్రాయ దృక్పథం పెంచుకోవాలి. నిర్దిష్ట సమయంలో సంబంధిత అన్ని అంశాలు ఎస్సేలో పొందుపరిచేలా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన అంశాలకు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన ఏర్పరచుకోవాలి.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతు న్న పథకాలు, లక్షిత వర్గాలు తదితర వివరాలను ఔపోసన పట్టాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పెట్టిన ఇతర ఆర్థిక విధానాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఇజ్రాయెల్– హమాస్ ఘర్షణలు.. అమె రికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికతోపాటు జీ 20, జీ 7, బ్రిక్స్ వంటి ముఖ్య సదస్సులను అధ్యయనం చేయాలి. జాతీయ స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, బిల్లులు, నూతన జాతీయ విద్యా విధానం, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒక దేశం–ఒక ఎన్నిక తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇటీవల కాలంలో కీలకమైన తీర్పుల గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
పేపర్–2 (భారత, ఏపీ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం)
ముందుగా ఏపీ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. చరిత్రకు సంబంధించి ప్రాచీన ఏపీ చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ.. ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించాలి. జాతీయోద్యమంలో ఆంధ్రదేశ పాత్ర గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
పేపర్–3 (పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా, ఎథిక్స్)
ఇందులో స్కోర్ కోసం రాజ్యంగం ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు తాజా పరిణామాల (రా జ్యాంగ సవరణలు వాటి ప్రభావం) వరకూ తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజా సేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. వాస్తవానికి దీనికి సంబంధించి ప్రత్యేక పుస్తకాలు లేనప్పటికీ.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాలు కొంత మేలు చేస్తాయి. వీటితోపాటు స్ఫూర్తిదాయక నేతల వివరాలు, వారు పాలించిన తీరు తదితర సమాచారాన్ని సేకరించుకోవాలి. న్యాయపరమైన అంశాలపైనా పట్టు సాధించాలి. ప్రాథమిక హక్కులు, విధులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు.. వీటికి సంబంధించి న్యాయ వ్యవస్థకున్న అధికారాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా సివిల్ అండ్ క్రిమినల్ లా, కార్మిక చట్టాలు, సైబర్ చట్టాలు, ట్యాక్స్ లాస్ గురించి తెలుసుకోవాలి.
పేపర్–4 (ఎకానమీ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి)
ఈ పేపర్ కోసం అభ్యర్థులు ఎకానమీకి సంబంధించి మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకు ని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేప ట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటి ద్వారా లబ్ధి చేకూరే వర్గాలు, అదే విధంగా జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తాజాగా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్ సర్వేలపై అవగాహన పెంచుకోవాలి.
పేపర్–5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరు లు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానా లపై అవగాహన పొందాలి.
రోజు వారీ ప్రణాళిక
అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమ యంలో పేపర్ వారీగా రోజు వారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి రోజు అన్ని పేపర్లను చదివే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి పేపర్‌కు సగటున రెండున్నర గంటల సమయం కేటాయించేలా చూసుకోవాలి. తమకు సులభం అనిపించే పేపర్లకు కొంత తక్కువ సమయం కేటాయించి, మిగతా సమయాన్ని క్లిష్టంగా భావించే పేపర్లకు కేటాయించాలి.
పునశ్చరణకే అధిక ప్రాధాన్యం
ప్రస్తుత సమయంలో అభ్యర్థులు పునశ్చరణకు అధి క ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే పట్టు సాధించిన అంశాలపై మరింత అవగాహన పొందేందుకు కృషి చేయాలి. పరీక్షకు ముందు వారం రోజుల నుంచి అభ్యర్థులు పుస్తకాల జోలికి వెళ్లకుండా రెడీ రెకన ర్స్‌ను వినియోగించి ప్రిపరేషన్ సాగించాలి. ఇందుకోసం ప్రిపరేషన్ సమయంలో రాసుకున్న సొంత నోట్స్ మేలు చేస్తుంది.
![]() ![]() |
![]() ![]() |
రైటింగ్ ప్రాక్టీస్
మెయిన్స్ పరీక్షల్లో రాణించేందుకు రైటింగ్ ప్రాక్టీస్ తప్పనిసరని గుర్తించాలి. ప్రతి రోజు తాము చదివిన టాపిక్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం రాయడం అలవర్చుకోవాలి. అదే విధంగా పరీక్ష హాల్లో ప్రతి ప్రశ్నకు సగటున లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. వేగంగా రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత వాటిని మూల్యాంకన చేసుకుని అన్ని పాయింట్లు రాశామా? లేదా? అని తెలుసుకోవాలి.
స్పష్టత ముఖ్యం
మెయిన్స్ సమాధానాల్లో భావ వ్యక్తీకరణ కీలకంగా మారుతుంది. అదే విధంగా సంబంధిత అంశంపై సూటిగా, స్పష్టంగా సమాధానమిచ్చే నేర్పు అవసరం. అభ్యర్థులు నమూనా ప్రశ్నలను సాధన చేయాలి. సమాధానాలు రాసేటప్పుడు ముఖ్యమైన అంశాలు హైలెట్ అయ్యేలా చూసుకోవాలి. దీంతోపాటు ప్రశ్న ను ఏ ఉద్దేశంతో అడిగారో గ్రహించి.. దానికి అనుగు ణంగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధం కావాలి.
ఆన్‌లైన్ విధానంలో ప్రశ్నలు
ఈసారి మెయిన్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను ఆన్‌లైన్‌లో అప్పటికప్పుడు (పరీక్ష సమయానికి) ఇవ్వాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. అభ్యర్థులకు ట్యాబ్‌లను కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణ యించారు. ఈ ట్యాబ్ ఆధారిత.. ఆన్‌లైన్ ప్రశ్న ప త్రాలు, సమాధానాలు ఇచ్చే విషయంలో నమూనా ను కూడా ఏపీపీఎస్సీ అందుబాటులోకి తెచ్చింది.
Tags
- APPSC Group 1
- Group 1 Mains
- Strategies to succeed in Group 1 without taking coaching
- How to prepare for the APPSC Group 1
- APPSC Study Material
- APPSC Preparation 2025
- APPSC Group-1 Preparation
- Andhra Pradesh Public Service Commission
- 10 Essential Tips to Crack APPSC
- APPSC Group 1 books for Preparation
- APPSC Group 1 Syllabus
- Appsc group 1 mains preparation strategy
- Appsc group 1 mains preparation strategy pdf free download