APPSC Group 2 Exam: గ్రూప్2 పరీక్ష వాయిదా కుదరదన్న ఏపీపీఎస్సీ!

ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ తప్పులను సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోస్టర్ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
మార్చి 11వ తేదీన మరోమారు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. హై కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
ఎప్పటి నుంచో వివాదం ఉన్నప్పటికీ పరీక్ష దగ్గర పడటంతో వివాదం ముదిరింది. ఇందులో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని, పోస్టింగ్ సమయంలో ఇబ్బందులు వస్తాయని అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని సరి చేసిన తర్వాత పరీక్ష పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
కాకపోతే పరీక్ష వాయిదా కుదరదని ఏపీపీఎస్సీ చెప్పింది.
![]() ![]() |
![]() ![]() |
