APPSC Group 2 Main Exam 2025 : త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షలు.. ఎప్పుడంటే..!

సాక్షి ఎడ్యుకేషన్: ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలకు తేదీ ఇప్పటికే ఖరారైంది. ఈ నెల 23న ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్ రాత పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి, అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ పరీక్ష కోసం కేటాయించిన కేంద్రాల్లో ప్రతీ చిన్న ఏర్పాటు సరిగ్గా ఉండాలని, పరీక్షల సమయంలో అభ్యర్థికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని ఆదేశించారు. అయితే, నేడు.., పరీక్షల నిర్వహణపై సచివాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఎ.అనురాధతో కలసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగానే ఆయన అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.
92,250 మంది..
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లా కేంద్రాల్లోని 175 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు, మొత్తంగా.. 92,250 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు సీఎస్. ఇక, ఈ విషయంపై ముందుగా ఎ.అనురాధ గ్రూపు-2 మెయిన్ పరీక్షల ఏర్పాట్ల గురించి వివరించారు.
అవాస్తవాల ప్రచారణకు కఠిన చర్యలు..
గ్రూప్-2 మెయిన్ పరీక్షల నిర్వహణపై ఒక బుక్ లెట్‌ను ప్రతీ కేంద్రాలకు పంపించామని, ఆ సూచనలన్నీ లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే.. పరీక్షలు వాయిదా పడతాయనే దుష్ప్రచారం, లేదా ఇతర వ్యాఖ్యలను ఎవ్వరూ నమ్మకూడదని కోరారు. ఇలాంటి ప్రచారాలు ఎవరైనా చేస్తే, కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ముఖేశ్ కుమార్ మీనా.
MEIL Walk In Interviews : ఎంఈఐఎల్‌లో వాకిన్ ఇంటర్వ్యూలు.. పోస్టుల వివరాలివే..
సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్, ఆశాఖ కమిషనర్ కృతికా శుక్ల, సమాచారశాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల, ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐఎన్ మూర్తి, వర్చువల్ గా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, ఇతర అధికారులు పాల్టొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- appsc group 2 main
- Competitive Exams
- state exams updates
- APPSC
- appsc group 2 updates
- Exam Date Announcement
- appsc group 2 date announcement
- government jobs related exams
- AP Govt
- govt jobs in ap
- govt jobs exams in ap
- appsc group 2 main exam 2025
- group 2 main exam hall ticket download
- ap groups exams updates
- group 2 main exam in ap latest update
- Education News
- Sakshi Education News