సాక్షి, అమరావతి: నిన్న(ఆదివారం) జరిగిన గ్రూప్–2 మెయిన్స్ ప్రాథమిక ‘కీ’ని ఏపీపీఎస్సీ(APPSC) విడుదల చేసింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్రశ్నలు, జవాబులపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 27వరకు http://psc.ap.gov.in లో తెలపాలని ఏపీపీఎస్సీ విజ్ఞప్తి చేసింది.
Breaking News APPSC Group-2 Mains Key 2025 Released
అభ్యంతరాలపై గడువు తేదీ ఇదే..
అభ్యర్థికి ప్రశ్నలు లేదా కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కమిషన్ అందించిన http://psc.ap.gov.in లింక్ ద్వారా మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. పోస్ట్/వాట్సాప్/ఎస్ఎంఎస్/ఫోన్/వ్యక్తిగత సమర్పణలు లేదా మరే ఇతర విధానం ద్వారా అభ్యంతరాలు స్వీకరించబడవు.
గడువు తేదీ ఫిబ్రవరి 27 తర్వాత వచ్చిన అభ్యంతరాలను సైతం పరిగణించరు.ఈ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత, తుది కీ విడుదల చేయబడుతుంది.తుది కీ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా తర్వాత విడుదల చేస్తారు.