Skip to main content

APPSC Group 1 Main exam dates announced: ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల :పూర్తి షెడ్యూల్‌ను ఇక్కడ తనిఖీ చేయండి

APPSC Group 1 Main exam dates announced  APPSC Group-1 Main Exam Schedule

గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏడు పేపర్లకు వరుసగా ఏడు రోజులు పరీక్షలు(డిస్క్రిప్టివ్‌) నిర్వహిస్తారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రశ్నాపత్రాలను ట్యాబ్స్‌ ద్వారా పంపిణీ చేయనున్నారు.  2023 డిసెంబర్‌లో 89 గ్రూప్‌–1 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

గతేడాది మార్చి 17న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఏప్రిల్‌లో ఫలితాలు వెల్లడించారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున (1:50) 4,496 మంది మెయిన్స్‌కి ఎంపికయ్యారు. వీరికి మేలో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో మెయిన్‌ పరీక్షలు నిర్వహిం­చనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి  తెలిపారు.  

పరీక్షల షెడ్యూల్‌ ఇదీ.. 
మే 3: తెలుగు పేపర్‌ (అర్హత పరీక్ష) 
మే 4: ఇంగ్లిష్‌ పేపర్‌ (అర్హత పరీక్ష) 
మే 5: పేపర్‌–1: జనరల్‌ ఎస్సే 
మే 6: పేపర్‌–2: భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర–సంస్కృతి, భూగోళిక అంశాలు  
మే 7: పేపర్‌–3: పాలిటీ,భారత రాజ్యాంగం, పాలన, లా అండ్‌ ఎథిక్స్‌ 
మే 8: పేపర్‌–4: భారత, ఆంధ్రప్రదేశ్‌ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి. 
మే 9: పేపర్‌–5: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు   

 ఇదీ చదవండి: APPSC Group 1 Ranker: అమ్మ కష్టం, త్యాగం.. నన్ను గ్రూప్-1 సాధించేలా చేసింది!
మే 3 నుంచి 9వ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

పరీక్ష తేదీ సమయం విషయం
03.05.2025 ఉదయం 10.00 -మధ్యాహ్నం 01.00 వరకు తెలుగు(క్వాలిఫ‌యింగ్ టెస్ట్)
04.05.2025
ఉదయం 10.00 -మధ్యాహ్నం 01.00 వరకు
ఇంగ్లీష్‌(క్వాలిఫ‌యింగ్ టెస్ట్)
05.05.2025
ఉదయం 10.00 -మధ్యాహ్నం 01.00 వరకు
జ‌న‌ర‌ల్ ఎస్సే
06.05.2025
ఉదయం 10.00 -మధ్యాహ్నం 01.00 వరకు
హిస్ట‌రీ, క‌ల్చ‌ర్ అండ్ జియోగ్ర‌ఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఆంధ్రప్రదేశ్‌
07.05.2025
ఉదయం 10.00 -మధ్యాహ్నం 01.00 వరకు
భారత రాజ్యాంగం అండ్ గ‌వ‌ర్నెన్స్‌, లా అండ్‌ ఎథిక్స్‌
08.05.2025
ఉదయం 10.00 -మధ్యాహ్నం 01.00 వరకు
భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌ యొక్క ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
09.05.2025
ఉదయం 10.00 -మధ్యాహ్నం 01.00 వరకు
సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ పర్యావరణ సమస్యలు

ఇదీ చదవండి: Study Material
 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 22 Jan 2025 11:19AM
PDF

Photo Stories