Skip to main content

APPSC Group 1 Mains: గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలో రాణించేందుకు మార్గాలు!

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే వ్యూహాత్మక ప్రిపరేషన్‌ అనివార్యం. ఈ పోటీ పరీక్షలో డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, సీటీఓ వంటి ప్రతిష్టాత్మక ఉద్యోగాలకు ఎంపిక అవ్వవచ్చు. మే 3 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మెరుగుపరచడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు...
APPSC Group 1 Mains exam tips for success   APPSC Group 1 Mains Preparation tips  APPSC Group 1 Mains exam preparation tips  Strategic preparation for APPSC Group 1 Mains  Top tips for cracking APPSC Group 1 Mains

గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షా విధానం

  • మొత్తం పేపర్లు: 7 (2 అర్హత, 5 ప్రధాన పేపర్లు)
  • కలెక్టర్‌, డీఎస్పీ వంటి హై లెవల్ పోస్టులకు అవకాశం
  • ఇంటర్వ్యూకు ఎంపిక కోసం మెయిన్స్‌లో హై స్కోర్‌ అవసరం

ప్రధాన పేపర్ల ప్రిపరేషన్‌ టిప్స్

జనరల్ ఎస్సే (పేపర్-1)

  • సమకాలీన అంశాలపై అవగాహన
  • వ్యాసరచనకు సరైన స్ట్రక్చర్‌
  • ప్రస్తుత వ్యవస్థపై విశ్లేషణాత్మక దృక్పథం
  • ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రాజ్యాంగ సవరణలు, SC తీర్పులపై అవగాహన

చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం (పేపర్-2)

  • దేశ, రాష్ట్ర చరిత్రపై స్పష్టమైన అవగాహన
  • ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక వనరులు, వ్యవసాయ విధానాల అధ్యయనం
  • జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్రకు ప్రాధాన్యం

పాలిటీ, రాజ్యాంగం, గవర్నెన్స్‌, లా, ఎథిక్స్‌ (పేపర్-3)

  • రాజ్యాంగ నిర్మాణం, మౌలిక హక్కులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు
  • ప్రజాస్వామ్యంలో పాలన విధానాలు, న్యాయ వ్యవస్థ అధికారాలు
  • గవర్నెన్స్‌, లా, ట్యాక్స్‌ లాస్‌ వంటి అంశాలపై అవగాహన

ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి (పేపర్-4)

  • జాతీయ, రాష్ట్ర స్థాయి ఆర్థిక విధానాలు
  • ప్రస్తుత బడ్జెట్‌, ఆర్థిక వ్యవస్థ మార్పుల అధ్యయనం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (పేపర్-5)

  • భారతదేశ రక్షణ రంగం, DRDO కొత్త ప్రాజెక్టులు
  • అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు
  • ఇంధన వనరులు, వైద్య రంగంలో పురోగతి

చదవండి: APPSC Group-1,2: గ్రూప్స్‌ అభ్యర్థులు చదవాల్సిన పుస్తకాలు ఇవే!!

గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షా షెడ్యూల్ (2025)

తేదీ

పేపర్‌

మార్కులు

మే 3

తెలుగు లాంగ్వేజ్‌

150

మే 4

ఇంగ్లీష్‌

150

మే 5

జనరల్‌ ఎస్సే

150

మే 6

చరిత్ర, భౌగోళిక శాస్త్రం

150

మే 7

పాలిటీ, గవర్నెన్స్‌, ఎథిక్స్‌

150

మే 8

ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి

150

మే 9

సైన్స్‌, టెక్నాలజీ

150

మెయిన్‌ టోటల్‌

750 మార్కులు

 

ఇంటర్వ్యూ

75 మార్కులు

 

మొత్తం

825 మార్కులు

 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

మెయిన్స్‌ పరీక్షలో విజయం సాధించేందుకు ముఖ్యమైన టిప్స్

  • రైటింగ్‌ ప్రాక్టీస్‌: సమయపాలనతో సమాధానాల రచన చేయాలి
  • మొదటి రివిజన్‌: గతంలో చదివిన అంశాలను తిరిగి రివైజ్‌ చేయడం ముఖ్యం
  • ప్రశ్నల అవగాహన: ప్రశ్నలదృక్పథాన్ని అర్థం చేసుకుని సమాధానాలు ఇవ్వాలి
  • స్ర్కిప్టింగ్‌ & టైమ్‌ మేనేజ్‌మెంట్‌: సమయాన్ని పకడ్బందిగా నియంత్రించుకోవాలి
Published date : 02 Apr 2025 08:34AM

Photo Stories