APPSC Group 1 & 2 Jobs 2023 : సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహించిన.. గ్రూప్–1, 2 పరీక్షల ఉచిత అవగాహన సదస్సు విజయవంతం.. భారీగా వచ్చిన విద్యార్థులు
ఈ ఉచిత అవగాహన సదస్సుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, గెస్ట్ స్పీకర్‌గా సివిల్స్ టాపర్ బాలలత గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు మాట్లాడుతూ.. జీవితం విజయం సాధించాలంటే.. ప్రతి విద్యార్థి సరైన క్రమశిక్షణ, ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. నేను నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేడు ఈ స్థాయిలో ఉన్నాను. అలాగే సివిల్స్ టాపర్ బాలలత గారు జీవితం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్ని నేడు ఈ స్థాయిలో ఉన్నారంటే.. వీరు విజయం సాధించడం కోసం ఎంత కష్టపడి ఉంటారో మీరు గ్రహించాలన్నారు. మీరు ఎంపిక చేసుకున్న రంగంలో సక్సెస్ సాధించాలంటే.. నా జీవితంతో పాటు.. బాలలత గారి జీవితం ను మీరు ఇన్ఫిరేషన్ గా తీసుకోవచ్చని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు గ్రూప్ 1& 2 అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు
సివిల్స్ టాపర్ బాలలత గారు మాట్లాడుతూ..
ఏపీపీఎస్సీ గ్రూప్–1,2 ఉచిత అవగాహన సదస్సులో సివిల్స్ టాపర్ బాలలత గారు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి జీవితంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి ఈ లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమించాలన్నారు. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్-1 &2 లో విజయం సాధించాలంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి..? గ్రూప్-1 &2 సిలబస్ ఎలా ఉంటుంది.. ? ప్రిపరేషన్ స్టాటజీ ఎలా ఉండాలి..? గ్రూప్-1 &2 పరీక్షల్లో Negative Marks విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి..? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, బడ్జెట్ సర్వేలు ఎలా చదవాలి..? అలాగే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ మొదలైన కీలక అంశాలను ఎలా చదవాలి..? ఇలా ముఖ్యమైన అంశాలను ఈ అవగాహన సదస్సుకు హాజరైన గ్రూప్-1 &2 అభ్యర్థులకు బాలలత గారు వివరించారు. అలాగే ఈమె గ్రూప్-1 &2 అభ్యర్థులకు అవగాహన కల్పించడంతో పాటు వీరికి ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేశారు.
Tags
- appsc group 1 and group 2 guidance
- ap assembly speaker tammineni sitaram
- civils topper bala latha
- APPSC Group 1 Jobs 2023
- Appsc group 2 jobs 2023
- APPSC Group 2 Guidance
- appsc group 1 guidance
- appsc group 1 preparation strategy
- appsc group 2 preparation strategy
- how to crack appsc group 1 and 2
- appsc groups jobs 2023
- bala latha madam
- UPSC Civils Mentor Bala Latha Madam
- sakshi education
- APPSC Group-1
- APPSC Group-2
- Free Awareness Conference
- Srikakulam
- Andhra Pradesh
- Success Stroy
- education response
- Education