Skip to main content

TGPSC Groups Again Notifications 2025 : మళ్లీ గ్రూప్‌ -1, 2, 3 కొత్త‌ నోటిఫికేషన్లు విడుద‌ల‌... ఎప్పుడంటే..? ఈ సారి మాత్రం ఇలాగే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌లే గ్రూప్‌-1, 2, 3 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. అయితే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.
TSPSC Group 1 and Group 2 Again Notifications 2025  Telangana PSC Group Exams 2025 Results Announcement  Group-1, 2, and 3 Telangana PSC Exam Results

అలాగే ఈ ఫ‌లితాల విడుద‌ల త‌ర్వాత‌ మ‌రో సారి గ్రూప్స్‌ ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు టీజీపీఎస్సీ మ‌రో శుభ‌వార్త‌ చెప్పబోతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత కొత్తగా మళ్లీ గ్రూప్స్‌ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం స్వ‌యంగా తెలిపారు. గ్రూప్‌ -1, 2తో పాటు గ్రూప్‌-3 నోటిఫికేషన్లు కూడా ఇస్తామని తెలిపారు. 

జ‌న‌వ‌రి చివ‌రిలోపే...

ఇప్పుడు జరుగుతోన్న నియామక ప్రక్రియను ఈ ఏడాది మార్చి నెలాఖరులోపు దాదాపు పూర్తి చేస్తామన్నారు. ఈ జ‌న‌వ‌రి చివ‌రిలోపే గ్రూప్‌-1, 2, 3 ఫలితాలు ప్రకటిస్తామని వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ తెలిపారు.

Published date : 10 Jan 2025 01:56PM

Photo Stories