Skip to main content

TSPSC Group 1 Posts Competition Ratio 2024 : ఫైన‌ల్‌గా గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ అంటే...?

సాక్షి ఎడ్య‌కేష‌న్ : ఎన్నో ఆటంకాల మ‌ధ్య ప్రారంభ‌మైన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు ఎట్ట‌కేల‌కు ముగిసాయి. అక్టోబ‌ర్ 21వ తేదీన‌ ప్రారంభమైన మెయిన్స్ పరీక్షలు 27వ తేదీతో ముగిశాయి.
TSPSC Group 1 Posts Competition Ratio 2024

టీఎస్‌పీఎస్సీ 563 గ్రూప్‌-1 పోస్టుల‌కు నోటిఫికేషన్‌ విడుదలైన విష‌యం తెల్సిందే. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మరో 20 మంది స్పోర్ట్స్ క్యాండిడేట్లు పరీక్ష రాసేందుకు ప్రత్యేకంగా కోర్టు నుంచి అనుమతి పొందారు.

➤☛ APPSC Jobs Notification Details 2024 : ఏపీపీఎస్సీ విడుద‌ల చేయ‌నున్న ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవే...? ఇంకా ఫెండింగ్‌లో ఉన్న‌వి కూడా...

గ్రూప్‌-1 మెయిన్స్ హాజ‌రు శాతం ఇంతేనా...?
అయితే, మొత్తం వారం రోజుల పాటు కేవలం 21,093 (67.17%) మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో ఉన్నట్టయింది.  చివరి రోజు ఆదివారం 21,151 మంది హాజరయ్యారు. 

➤☛ ఏఏ నెల‌లో.. ఏఏ పోస్టులను ఎప్పుడు భ‌ర్తీ చేస్తారంటే..? గ్రూప్‌-2, 3 పోస్టుల సంఖ్య పెంపు ?

నాన్-లోకల్ అభ్యర్థులు..
గ్రూప్ 1లో 5% అన్‌ రిజర్వ్‌డ్ పోస్టులకు మొత్తం 2,550 మంది అభ్యర్థులతో షార్ట్‌లిస్ట్ చేసినట్టు చెప్పారు. దీంట్లో 182 మంది నాన్-లోకల్ అభ్యర్థులు ఉన్నారు.

అత్యధికంగా బీసీలే గ్రూప్‌-1కి...
గ్రూప్ 1 మెయిన్స్​కు సెలక్ట్ అయిన వారి వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఏ కేటగిరీకి చెందిన వారు ఎంతమంది క్వాలిఫై అయ్యారనే వివరాలను ఆదివారం ప్రకటించింది. ఒక్కో పోస్టుకు 1:50 రేషియోలో గ్రూప్-1 మెయిన్స్​కు మొత్తం 31,383 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఓసీలు 3,076 మంది ఉన్నారు. అత్యధికంగా బీసీలు17,921 మంది అర్హత సాధించగా, ఎస్సీలు 4,828 మంది, ఎస్టీలు 2,783 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,774 మంది క్వాలిఫై అయ్యారు. పీడబ్ల్యూడీ కేటగిరీలో మెయిన్స్​కు 1,299 మందిని ఎంపిక చేశామని, కానీ వారిని ఆయా కమ్యూనిటీల్లో చూపించామని టీజీపీఎస్సీ తెలిపింది.

➤☛ TSPSC Group 2 Ranker Interview : ఇంటి నుంచే చ‌దివి గ్రూప్‌-2 జాబ్‌ కొట్టానిలా...| గ్రూప్‌-2కు నేను చ‌దివిన పుస్త‌కాలు ఇవే...

Published date : 28 Oct 2024 03:29PM

Photo Stories