Skip to main content

TGPSC Group 1 Mains Postpone : టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్ష రాసే అభ్య‌ర్థులు భ‌యం భయంతో...! ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష రాయ‌నున్న అభ్య‌ర్థులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది పేపర్ లీకేజీ కారణంగా పలు నియామక పరీక్షలు రాసిన తర్వాత అనేక సార్లు వాయిదా పడిన ఘటనలను నుంచి నిరుద్యోగులు ఇంకా తేరుకోలేక పోతున్నారు. చిన్నచిన్న తప్పిదాలతో ఏ ఎగ్జామ్ ఎప్పుడు రద్దు అవుతుందోనని భ‌యం భ‌యంగా ఉన్నారు.
TSPSC Group 1 Candidates

ఇప్పటికీ కూడా టీస్‌పీఎస్సీ తీరు మార‌లేదు..?
ఇప్ప‌టికి మూడు సార్లు గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించినా.., మూడు సార్లు గ్రూప్ -2 షెడ్యూల్ ప్రకటించి వాయిదా వేయాల్సి వ‌చ్చింది. అయినా కూడా ఇప్పటికీ తప్పులు లేకుండా పరీక్షలు నిర్వహించే స్థితిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

గ్రూప్‌-1పై 10కి పైగా ఉన్న కోర్టు కేసులు..

tspsc group 1 candidate news telugu

అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో.. గ్రూప్‌-1 మెయిన్స్‌పై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు కారణం గ్రూప్-1పై కోర్టులో ఉన్న కేసులే కారణం. పదికి పైగా ఉన్న కోర్టు కేసుల వల్ల ఎదైనా ప్ర‌భావం ఉంటుందేమోనని విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఈ చిక్కులు తొలిగాకే ప‌రీక్ష‌లు పెట్టండి.. లేదా..

tspsc group 1 mains exam problems news telugu

గ్రూప్‌-1పై ఉన్న‌ న్యాయపరమైన చిక్కులు తొలిగాకే ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. అలానే ఉండి ప్రభుత్వం మొండిపట్టుకు పోయి మెయిన్స్ నిర్వహించినా.., తర్వాత కోర్టు ఫలితం వ్యతిరేకంగా వస్తే మళ్ళీ మెయిన్స్ రాయాల్సి వస్తుందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. కోర్టు కేసుల పరిష్కార మార్గం చూపి.. అభ్యర్థులకు క్లారిటీ ఇస్తే బాగుంటందని నిరుద్యోగులు వాపోతున్నారు. 

TGPSC సెక్రటరీ నవీన్ నికోలస్‌ను క‌లిసి..
కొంతమంది గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులు TGPSC సెక్రటరీ నవీన్ నికోలస్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. 

స్పోర్ట్ కోటా రిజర్వేషన్ల పైన...
సెప్టెంబర్ 20న స్పోర్ట్ కోటా రిజర్వేషన్ల పైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తెలంగాణ హైకోర్టు కేసు వేసిన పిటిషనర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ముందుగా కమిషన్ నిర్ణయించినట్టు ఫార్మ్ 1 కలిగిన విద్యార్థులే కాకుండా ఫామ్ 2 ఉన్న విద్యార్థులను కూడా మెయిన్స్ రాసేందుకు అనుమతించాలని కమిషన్‌ ఆదేశించింది. కొత్తగా అనుమతించబడ్డ ఈ అభ్యర్థుల తుది మెయిన్స్ ఫలితం హైకోర్టు నవంబర్ 20న ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుందని కోర్టు ప్రకటించినప్పటికీ, ఈ కోర్టు ఆదేశాల పైన కమిషన్ ఇంకా ఏ విధమైన ప్రకటన చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇలాంటి అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తే..

tspsc group 1 problems news telugu

కోర్టు ఆదేశాలతో స్పోర్ట్స్ కోటాలో కొత్తవాళ్లు మెయిన్స్ కు అర్హత సాధించారు. ఇలాంటి అన్ని విషయాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇచ్చి నిరుద్యోగుల్లో నెలకున్న ఆందోళనలను తొలగించాలని కోరుతున్నారు.

Published date : 03 Oct 2024 10:53AM

Photo Stories