TGPSC Group 1 Jobs: ఈ రెండు కేటగిరీల్లో తీవ్ర పోటీ!.. ఒక్కో పోస్టుకు ఇంత మంది పోటీ!
దీంతో జవాబు పత్రాల ముల్యాంకనాన్ని అతిత్వర లో చేపట్టేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. తొలుత జవాబు పత్రాల క్రోడీకరణ, మూల్యాంకనానికి నిపుణుల అర్హతలను సంస్థ నిర్ధారించనుంది. ప్రొఫెసర్ల ఎంపిక అనంతరం జవాబుపత్రాల మూల్యాంకనం మొదలుకానుంది. ఈ ప్రక్రియ నిర్వ హించేందుకు కనీసం రెండున్నర నెలల సమ యం పట్టొచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గతంలో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ కనిష్టంగా మూడు నెలలు పట్టిందని చెబుతున్నాయి. మెయిన్స్‌లో జనరల్ ఇంగ్లిష్‌తోపాటు ఆరు పేపర్లను అభ్యర్థులు రాశారు. అయితే జనరల్ ఇంగ్లిష్‌లో అభ్యర్థులు సాధించే మార్కులను కేవలం అర్హతగానే పరిగణించనున్న కమిషన్.. మిగిలిన 6 సబ్జెక్టుల్లో అభ్యర్థులు సాధించే మార్కుల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
చదవండి: Government Jobs: పల్లెల్లో సర్కారీ కొలువులపై అనాసక్తి.. ఎందుకో తెలుసా?
అత్యధిక పోటీ వారి మధ్యే..
మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో రిజర్వేషన్లవారీగా అభ్యర్థులు ఎంపికైనప్పటికీ ప్రస్తుతం ఆయా అభ్యర్థులందరికీ (స్పోర్ట్స్ అభ్యర్థులు మినహా) ఓపెన్ కేటగిరీలో పోటీకి అర్హత ఉంది. అయితే ఒకవేళ ఓపెన్ కేటగిరీలో ఎంపిక కాకుంటే రిజర్వుడ్ కేటగిరీలో పోటీ పడాల్సి ఉంటుంది. ఇందులో అత్యధిక పోటీ బీసీ–డీ, బీసీ–బీ కేటగిరీల్లో ఉంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
బీసీ–డీ కేటగిరీలో 22 పోస్టులు ఉండగా ఈ కేటగిరీలో ఒక్కో పోస్టుకు సగటున 175 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా బీసీ–బీ కేటగిరీలో 37 పోస్టులు ఉండగా ఒక్కో పోస్టుకు సగటున 128 మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత బీసీ–ఈ, బీసీ–సీ కేటగిరీల్లో పోటీ ఉంది. స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు ఆ కేటగిరీకే పరిమితం కానున్నారు.
హైకోర్టు తీర్పుతో స్పోర్ట్స్ కేటగిరీలో 20 మంది అభ్యర్థులకు టీజీపీఎస్సీ చివరి నిమిషంలో మెయిన్స్‌కు అవకాశం కల్పించినా 19 మందే అన్ని పరీక్షలకూ హాజరయ్యారు. ఇక డిజేబుల్డ్ కేటగిరీలో 24 పోస్టులున్నాయి. ఇందులో 1,299 మంది అభ్యర్థులు ఎంపికైనా వారికి ఓపెన్, కమ్యూనిటీ రిజర్వేషన్లలోనూ అవకాశం లభించనుంది.
కేటగిరీ |
పోస్టులు |
అభ్యర్థులు |
పోటీ |
ఓపెన్ |
209 |
2,384 |
11.40669856 |
ఈడబ్ల్యూఎస్ |
49 |
1778 |
36.28571429 |
బీసీ–ఏ |
44 |
1648 |
37.45454545 |
బీసీ–బీ |
37 |
4743 |
128.1891892 |
బీసీ–సీ |
13 |
527 |
40.53846154 |
బీసీ–డీ |
22 |
3,847 |
174.8636364 |
బీసీ–ఈ |
16 |
661 |
41.3125 |
ఎస్సీ |
93 |
3,503 |
37.66666667 |
ఎస్టీ |
52 |
1983 |
38.13461538 |
స్పోర్ట్స్ |
4 |
19 |
4.75 |
పీహెచ్ |
24 |
1,299 |
54.125 |
Tags
- TSPSC Group 1 Posts
- TGPSC Group 1 Jobs
- TGPSC Group 1 Posts Competition Ratio 2024
- Tgpsc Group 1 Jobs Competition
- TGPSC Group 1 Recruitment 2024
- Tgpsc Group 1 Jobs Salary
- TSPSC Group 1 Mains Results 2024
- TSPSC Group 1 Mains Results 2024 News
- TSPSC Group 1 Posts Final Competition Ratio 2024 News in Telugu
- TGPSC Group 1 Posts Final Competition Ratio 2024
- TGPSC Group 1 Mains Result Update
- tspsc group 1 mains category wise vacancy 2024
- TGPSC Group 1 Mains Exam Rules
- TSPSC group 1 Jobs News telugu
- Telangana News
- TSPSC
- TGPSC