Skip to main content

TSPSC Group-1 Mains Results Date 2024 : తెలంగాణ గ్రూప్‌-1 ఫ‌లితాలు విడుద‌ల ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ 563 గ్రూప్‌-1 పోస్టుల‌కు నోటిఫికేషన్‌ విడుదలైన విష‌యం తెల్సిందే. ఇటీవ‌ల ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన మెయిన్స్ ప‌రీక్ష‌లు కూడా ముగిసాయి.
TSPSC Group 1 Mains Results Date 2024

దీంతో గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ ఫోకస్ చేసింది. ఇంటర్వ్యూలు లేకపోవడంతో రాతపరీక్షలో వచ్చిన మార్కులే కీలకం కానున్నాయి. 

ఈ ఫ‌లితాల విడుద‌ల‌కు దాదాపు..
ఈ నేపథ్యంలో పకడ్బందీగా గ్రూప్‌-1 మెయిన్స్ పేప‌ర్‌ వాల్యుయేషన్ నిర్వహణకు చర్యలు తీసుకుంటుంది. దీంతో ఫలితాలకు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఫలితాలు హైకోర్టు తీర్పునకు లోబడే ఉండొచ్చని తెలుస్తోంది.

☛➤ Again TS TET and DSC Notification : మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌... ఎప్పుడంటే...? అలాగే టెట్ కూడా.. ఈ సారి ఈ పోస్టుల‌ను..

ఒక్కో పోస్టుకు 37 మంది పోటీ.. కానీ..
మొత్తం 31,383 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించారు. మరో 20 మంది స్పోర్ట్స్ క్యాండిడేట్లు పరీక్ష రాసేందుకు ప్రత్యేకంగా కోర్టు నుంచి అనుమతి పొందారు. మొత్తం వారం రోజుల పాటు కేవలం 21,093 (67.17%) మంది మాత్రమే ఈ పరీక్షలకు అటెండ్ అయినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 37 మంది పోటీలో ఉన్నట్టయింది.

Published date : 30 Oct 2024 09:09AM

Photo Stories