Skip to main content

Breaking News: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Supreme Court dismisses petitions against Telangana Group-1 exam   Breaking News: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు  గ్రీన్‌ సిగ్నల్‌
Supreme Court dismisses petitions against Telangana Group-1 exam Breaking News: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సోమవారం(ఫిబ్రవరి3) సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్-1 నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో  పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అంతకముందు రాష్ట్ర హైకోర్టు తమ పిటిషన్‌లను కొట్టేయడంతో అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.ఫలితాలు వెల్లడించడంపై తెలంగాణ ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో,త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత గ్రూప్‌-1 పరీక్ష తొలిసారిగా జరగడం గమనార్హం.

ఇదీ చదవండి:  టీజీ ఈఏపీసెట్ 2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రూప్‌ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్‌-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్‌ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఫలితాలు వెల్లడించనున్నారు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 04 Feb 2025 10:25AM

Photo Stories