Skip to main content

TGPSC Group 1 Results : మొత్తం 563 పోస్టుల‌కు గ్రూప్‌-1 ప‌రీక్ష.. ఈనెల‌లోనే ఫ‌లితాల వెల్ల‌డి..

తెలంగాణ‌లో ఇప్ప‌టికే గ్రూప్‌-1 ప‌రీక్ష‌లు ముగిసాయి. త్వ‌ర‌లోనే ప‌రీక్ష‌కు సంబంధించిన ఫ‌లితాలు కూడా విడుద‌ల కానున్నాయి.
TGPSC group 1 results in february 2025 ending

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ‌లో ఇప్ప‌టికే గ్రూప్‌-1 ప‌రీక్ష‌లు ముగిసాయి. త్వ‌ర‌లోనే ప‌రీక్ష‌కు సంబంధించిన ఫ‌లితాలు కూడా విడుద‌ల కానున్నాయి. అయితే, ఉద్యోగాల భ‌ర్తీని మాత్రం అభ్య్రర్థుల ప్రాధాన్య‌త‌తోనే చేయాల‌ని క‌మిష‌న్ నిర్ణ‌యించింది. ఈ ప‌రీక్ష‌ను మొత్తం 563 పోస్టుల‌కు నిర్వ‌హించారు. ఇప్ప‌టికే పూర్తి అయిన ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాలు ఈనెల‌లోనే అంటే, ఫిబ్ర‌వ‌రిలోనే విడుద‌ల కానున్నాయి.

13,000 Jobs Fake Notification: 13,762 ఉద్యోగాలంటూ ప్రచారం.. అదంతా ఫేక్‌ నోటిఫికేషన్‌

1:2 నిష్ప‌త్తితో..

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల జ‌వాబు ప‌త్రాల మూల్యాంక‌నం ముగిసింది. త్వ‌ర‌లోనే ఫ‌లిత‌ల‌ను కూడా వెల్ల‌డింనుంది క‌మిష‌న్‌. అయితే, ఈ గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లో అభ్య‌ర్థులు సాధించే మార్కుల ఆధారంగా 1:2 నిష్ప‌త్తిలో మెరిట్ జాబితా ఉంటుంద‌ని క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది. మెయిన్స్‌ ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

రీకౌంటింగ్‌కు వెయ్యి..

గ్రూప్‌ 1 నియామకాలు పూర్తైన తర్వాత గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3 పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాధాన్య క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేస్తే బ్యాక్‌లాగ్‌ ఉండవని ఈ మేరకు నిర్ణయించారు. విడుద‌లైన ఫ‌లితాల‌పై అభ్య‌ర్థుల‌కు ఎలాంటి సందేహాలున్నా.. రీకౌంటింగ్ కలిపి మెరిట్ జాబితాతో ఆప్షన్ కల్పిస్తారు. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా విడుదల చేసిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

TGPSC Group-1, 2 Results 2025 : గ్రూప్‌-1, 2 ఫ‌లితాలు విడుద‌ల ఎప్పుడంటే...? అలాగే గ్రూప్‌-3 కూడా...!

గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందుకు 21,151 మంది (67.3 శాతం) హాజరయ్యారు. జనరల్ ర్యాకింగ్ లిస్ట్ విడుదలైతే… గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి దాదాపు లైన్ క్లియర్ అవుతోంది.
ఇప్ప‌టికే పూర్తికావాల్సిన మూల్యాంక‌నం, కీ విడుద‌ల, అభ్యంత‌రాల వెల్లడి వంటివి పూర్తి అయ్యాయి. ఇక‌, మార్చి నెలఖారు నాటికి కీలకమైన గ్రూప్ 1, 2, 3 ప‌రీక్ష‌ల‌ ఫలితాలన్నీ విడుద‌ల‌వుతాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Feb 2025 03:53PM

Photo Stories