Skip to main content

TSPSC Group 1 Mains Exam Mass Copying : చీరకొంగు చాటున‌ చిట్టీలు పెట్టి... గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లో కాపీ...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఎన్నో ఆటంకాల మ‌ధ్య గ్రూప్‌-1 మెయిన్స్‌ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెల్సిందే. తాజాగా తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌లో కాపీయింగ్ కలకలం రేపుతోంది.
TSPSC Group 1 Mains Exam Mass Copying

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్ ప‌ల్లె సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జరిగింది. అయితే పరీక్షలో కాపీయింగ్ చేస్తూ మహిళా అభ్యర్థి ఇస్లవత్ లక్ష్మి పట్టుబడ్డారు. చీర కొంగులో చిట్టీలు అతికించుకొచ్చిన అభ్యర్థి పరీక్ష జరిగే సమయంలో కాపీయింగ్‌కు పాల్పడ్డారు. 

☛➤ Telangana Outsourcing Jobs : గుడ్‌న్యూస్‌.. 1878 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల‌ భ‌ర్తీకి ఉత్తర్వులు.. పోస్టుల వివ‌రాలు ఇవే...

అయితే కాపియింగ్‌కు పాల్పడే సమయంలో పోలీసులు అధిపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్‌లో ఎస్‌జీటీ టీచర్‌గా పనిచేస్తున్న ఇస్లావత్‌ లక్ష్మీపై టీజీపీఎస్‌ఈ నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 21న ప్రారంభమైన పరీక్షలు అక్టోబర్ 27 వరకు కొనసాగనున్నాయి. 

ఈ పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలో సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది.

☛➤ TG DSC Top Ranker Success Story : బ‌తుకు పోరాటంలో గెలిచిన పేదింటి బిడ్డ స‌క్సెస్ స్టోరీ ఇదే...!

Published date : 26 Oct 2024 03:04PM

Photo Stories