Skip to main content

TGPSC Group 1 Achiever : సివిల్స్‌తో సాధ్యం కాలేదు.. గ్రూప్‌తో ప్ర‌య‌త్నించి ఏకంగా..

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు అధికారులు.
TGPSC group 1 candidates gains eligibility for government job

సాక్షి ఎడ్యుకేష‌న్: సోమ‌వారం.. మార్చి 10వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు అధికారులు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫ‌లితాల‌ను ప‌రిశీలించుకోవ‌చ్చు. ఈ ప‌రీక్ష‌కు ల‌క్ష‌ల్లో అభ్య‌ర్థులు హాజ‌రైయ్యారు. వారిలో ఎంతో మంది ఎంపిక కాగా, అందులో ఒక‌రే.. సీసీసీ నస్పూర్‌కు చెందిన సింగరేణి కార్మికుడి కుమారుడు రిక్కుల సత్యనారాయణరెడ్డి. ఇత‌ను కూడా గ్రూప్‌-1 ప‌రీక్ష‌లో క్వాలిఫై అయ్యాడు.

నారాయ‌ణ‌లో చ‌దువుపూర్తి..

తెలంగాణ‌కు చెందిన స‌త్య‌నారాయ‌ణ రెడ్డి.. న్యూ నాగార్జున కాలనీలో నివాసముంటున్న చంద్రారెడ్డి సీసీసీ, అంజలి కుమారుడు. తండ్రి.. నస్పూర్‌ ఏరియాలోని వర్క్‌షాప్‌లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తుండ‌గా, త‌ల్లి గృహిణి.

TGPSC Group 2 Results : రేపే గ్రూప్‌-2 ఫ‌లితాలు విడుద‌ల‌... అలాగే గ్రూప్‌-3 కూడా.. దాదాపు పోస్టు ఎంపిక‌పై క్లారిటీ ఇలా...!

సత్యనారాయణరెడ్డి స్థానిక మార్టిన్‌ గ్రామర్‌ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివాడు. త‌రువాత 9, 10 తరగతులు వరంగల్‌లోని గ్రీన్‌వుడ్‌ పాఠశాలలో చ‌దివాడు. ఇక‌, ఇంట‌ర్ డిగ్రీ విద్య‌ను హైద‌రాబాద్‌లోని నారాయ‌ణ క‌ళాశాల‌లో పూర్తి చేసుకున్నాడు. 

సివిల్స్ నుంచి గ్రూప్స్‌కి..

త‌న చ‌దువు పూర్తి చేసుకున్న త‌రువాత‌, సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వాల‌నే ఆశ‌యంతో హైదరాబాద్‌లోనే కోచింగ్ ప్రారంభించాడు. అన్ని విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌క‌పోవ‌డంతో వెన‌క్కి తిరిగివెళ్ల‌కుండా గ్రూప్ ప‌రీక్ష‌ల‌పై దృష్టి సారించాడు. దీనిలో ఎలాగైనా ఎంప‌కై సేవ చేయాల‌నే ఆశ‌యంతో ముందుకు సాగాడు. ఇక‌, 2022లో హైద‌రాబాద్‌కి వ‌చ్చిన స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి బ‌య‌ట కోచింగ్‌పై ఆధార‌ప‌డ‌కుండా త‌న‌కు తానే కోచింగ్ తీసుకున్నాడు. వివిధ పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, వార్త‌లు చ‌ద‌వ‌డం, విన‌డం, వంటివి చేసేవాడు. సోంత ప్రిప‌రేష‌న్‌తోనే ప‌రీక్ష‌కు హాజ‌రై ఒక‌టి కాదు, గ్రూప్‌-1, 2, 3 మూడు ప‌రీక్ష‌లూ రాశాడు స‌త్య‌నారాయ‌ణ‌.

TGPSC Group Exams Results : త్వ‌ర‌లోనే టీజీపీఎస్సీ గ్రూప్స్ ఫ‌లితాలు.. మూడూ వ‌రుస‌గా..!!

గ్రూప్‌-1 ఫ‌లితాల్లో..

సివిల్స్ నుంచి గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు మ‌ళ్లిన స‌త్య‌నారాయ‌ణ ఒక‌టి కాదు మూడు గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేశాడు. పూర్తి అయిన ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల్లో గ్రూప్‌-1 ఫ‌లితాల‌ను సోమ‌వారం విడుద‌ల చేశాడు టీజీపీఎస్సీ అధికారులు. అయితే, ఇందులో స‌త్య‌నారాయ‌ణ‌కు 900 మార్కుల‌కు 420 మార్కులు వ‌చ్చాయి. దీంతో, స‌త్య‌నారాయ‌ణ గ్రూప్‌-1 క్వాలిఫై అయ్యి, ప్ర‌భుత్వ ఉద్యోగానికి అర్హ‌త సాధించాడ‌ని తెలుసుకున్న త‌న కుటుంబం ఆనందానికి అవ‌దుల్లేవు.

Telangana Group -1 Results Breaking News : నేడు తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

ఇక‌, మ‌రి కొద్ది రోజుల్లోనే గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఫ‌లితాలు కూడా విడుద‌ల కానున్నాయి. ఇక‌, స‌త్య‌నారాయ‌ణ గ్రూప్‌-1లో సాధించిన విధంగా గ్రూప్‌-2, 3లో కూడా ఉన్న‌తంగా మార్కుల‌ను సాధించి, స‌ర్కార్ ఉద్యోగానికి అర్హ‌త సాధిస్తే ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలుస్తాడు. ఇప్ప‌టికే, ఇత‌న ప్ర‌యాణం తెలుసుకున్న చాలామందికి ప్రోత్సాహికంగా, ఆద‌ర్శంగా నిలిచాడు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 11 Mar 2025 12:26PM

Photo Stories