APPSC Polytechnic Lecturer Notification: ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్ట్‌లు.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్..
- ఏపీలో 99 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన
- రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ
- ప్రారంభ వేతన శ్రేణి రూ.56,100 -రూ.98,400
- ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లలో ఖాళీలు
21 సబ్జెక్ట్‌లు-99 పోస్ట్‌లు
ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్ ద్వారా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 21 సబ్జెక్ట్‌లలో మొత్తం 99 పోస్ట్‌ల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్-1 పోస్ట్; ఆటోమొబైల్ ఇంజనీరింగ్-8 పోస్ట్‌లు; బయోమెడికల్ ఇంజనీరింగ్-2 పోస్ట్‌లు;కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్-12 పోస్ట్‌లు; సెరామిక్ టెక్నాలజీ-1 పోస్ట్; కెమిస్ట్రీ-8 పోస్ట్‌లు; సివిల్ ఇంజనీరింగ్-15 పోస్ట్‌లు; కంప్యూటర్ ఇంజనీరింగ్ 8 పోస్ట్‌లు; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-10 పోస్ట్‌లు; ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-2 పోస్ట్‌లు; ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-1 పోస్ట్; ఇంగ్లిష్-4 పోస్ట్‌లు; గార్మెంట్ టెక్నాలజీ-1 పోస్ట్; జియాలజీ-1 పోస్ట్; మ్యాథమెటిక్స్-4 పోస్ట్‌లు; మెకానికల్ ఇంజనీరింగ్-6 పోస్ట్‌లు;మెటలర్జికల్ ఇంజనీరింగ్-1 పోస్ట్, మైనింగ్ ఇంజనీరింగ్-4 పోస్ట్‌లు; ఫార్మసీ-3 పోస్ట్‌లు; ఫిజిక్స్-4 పోస్ట్‌లు;టెక్స్‌టైల్ టెక్నాలజీ-3 పోస్ట్‌లు.
అర్హతలు
- ఆయా సబ్జెక్ట్‌ను అనుసరించి బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్ట్‌లో పీజీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు అర్హత కోర్సులో కనీసం 55 శాతం మార్కులు సాధించాలి.
- వయసు: జూలై 1, 2023 నాటికి 18-42 ఏళ్లు ఉండాలి(బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అయిదేళ్లు; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాలకు పదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది).
చదవండి: Exam Preparation Tips: ఇలా చేస్తే.. సర్కారీ కొలువు సులువు
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా నియామకాలను చేపట్టనున్నారు. రాత పరీక్షను రెండు పేపర్లుగా 450 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నల(150 మార్కులు)కు ఉంటుంది. పేపర్-2: సంబంధిత సబ్జెక్ట్ పేపర్-150 ప్రశ్నల(300 మార్కులు)కు జరుగుతుంది. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. పేపర్-1లో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు; పేపర్-2లో ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున కేటాయిస్తారు. ప్రతి పేపర్‌కు రెండున్నర గంటల సమయం ఉంటుంది. నెగెటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కు తగ్గిస్తారు.
కనీస మార్కుల నిబంధన
రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే పోస్ట్‌ల భర్తీ చేపట్టనున్న నేపథ్యంలో.. కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులను నిర్దేశించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులు; బీసీ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు; ఎస్‌సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.
రాత పరీక్షలో రాణించేలా
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ
పేపర్-1గా పేర్కొన్న జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీలో రాణించేందుకు.. అభ్యర్థులు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. దీంతోపాటు జనరల్ సైన్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి, తాజా పరిస్థితులు, రక్షణ రంగంలో ప్రయోగాలు, ఇస్రో ప్రయోగాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. పర్యావరణ అంశాలకు సంబంధించి విపత్తు నిర్వహణ వ్యూహాలపై అవగాహన పెంచుకోవాలి. భారత్, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాలి. తాజాగా అమలవుతున్న అభివృద్ధి పథకాలను తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రాంత భౌగోళిక స్వరూపం, విశిష్టతలు తెలుసుకోవాలి. చరిత్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, భారత చరిత్రలను చదవాలి. వీటితోపాటు భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలన విధానం, భారత భౌగోళిక శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలను చదవాలి. పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించాలి.
చదవండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే .. ప్రిపరేషన్ కింగ్
పేపర్-2కు ఇలా
అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుపై నిర్వహించే పేపర్-2లో రాణించడానికి దృష్టి పెట్టాల్సిన అంశాలు..
- ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్: బేసిక్ డిజైన్, బిల్డింగ్ మెటీరియల్స్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ అండ్ గ్రాఫిక్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్, తదితర అంశాలు.
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్: ఆటోమొబైల్ పవర్ ప్లాంట్స్, ఆటోమొబైల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఆటోమొబైల్ ఛాసిస్ అండ్ బాడీ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ట్రాన్స్‌మిషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, మెటీరియల్ సైన్స్, కైనమాటిక్స్ అండ్ డైనమిక్స్ ఆఫ్ మెషీన్స్ తదితర అంశాలు.
- బయోమెడికల్ ఇంజనీరింగ్: రెస్పిరేటరీ మెజర్‌మెంట్స్ అండ్ ఎయిడ్, వెంటిలేటర్స్, ఆడియోమెట్రీ, ఎలక్ట్రో సర్జికల్ ఎక్విప్‌మెంట్స్, మెథడ్స్ ఆఫ్ కెమికల్ అనాలిసిస్ వంటి అంశాలు.
- సెరామిక్ టెక్నాలజీ: సిమెంట్ ఇండస్ట్రీ, పోర్ట్‌ల్యాండ్ సిమెంట్, స్పెషల్ సిమెంట్స్, స్పెషల్ సెరామిక్ మెటీరియల్స్, హై టెంపరేచర్ సెరామిక్ మెటీరియల్స్, సెరామిక్ కంపోజిట్స్, న్యూక్లియర్ సెరామిక్స్ తదితర అంశాలు.
- కంప్యూటర్ ఇంజనీరింగ్: హార్డ్‌వేర్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, థియరీ ఆఫ్ కంప్యుటేషన్, కంపైలర్స్, ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, డీబీఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్‌వర్క్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ఏఐ టెక్నిక్స్, తదితర అంశాలు.
- సివిల్ ఇంజనీరింగ్: స్ట్రక్చరల్ డిజైన్, బిల్డింగ్ మెటీరియల్ అండ్ కన్‌స్ట్రక్షన్, సర్వేయింగ్, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్,హైడ్రాలిక్స్,క్వాంటిటీ సర్వేయింగ్,డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లోని అంశాలు.
- ఈసీఈ: ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, నెట్‌వర్క్స్, డిజిటల్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన అంశాలు.
- ఈఈఈ: ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, తదితర అంశాలు.
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్: అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్స్, ప్రాసెస్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ తదితర టాపిక్స్.
- మెకానికల్ ఇంజనీరింగ్: అప్లైడ్ మెకానిక్స్ అండ్ డిజైన్, థర్మల్ ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్స్ మెషినరీ వంటి అంశాలు.
- మెటలర్జికల్ ఇంజనీరింగ్: మినరల్ ప్రాసెసింగ్ అండ్ ప్రిన్స్‌పుల్స్, ఫిజికల్ మెటలర్జీ అండ్ హీట్ ట్రీట్‌మెంట్, మెటలర్జికల్ థర్మోడైనమిక్స్, మెకానికల్ మెటలర్జీ, ఐరన్ అండ్ స్టీల్ మేకింగ్, పౌడర్ మెటలర్జీ ఆఫ్ మెటల్స్, మెటీరియల్ ప్రాసెసింగ్, ఫర్నేస్ టెక్నాలజీ, తదితరాలు.
- మైనింగ్ ఇంజనీరింగ్: మైన్ డెవలప్‌మెంట్, మైన్ సర్వేయింగ్, జియో మెకానిక్స్ అండ్ గ్రౌండ్ కంట్రోల్, సర్ఫేస్ ఎన్విరాన్‌మెంట్, మైన్ వెరిఫికేషన్, అండర్‌గ్రౌండ్ హజార్డ్స్, మైన్ ఎకనామిక్స్, మైన్ ప్లానింగ్ వంటి అంశాలు.
- టెక్స్‌టైల్ టెక్నాలజీ: టెక్స్‌టైల్ ఫైబర్స్, స్పిన్నింగ్, వీవింగ్, ఒవెన్ ఫ్యాబ్రిక్ డిజైన్, కెమికల్ ప్రాసెసింగ్ ఆఫ్ టెక్స్‌టైల్స్, అపారెల్ ప్రొడక్షన్, టెక్స్‌టైల్ టెస్టింగ్, స్టాటిస్టికల్ టూల్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, టెక్స్‌టైల్ మ్యాథమెటిక్స్, నిట్టింగ్ అండ్ నాన్-ఒవెన్ టెక్నాలజీకు సంబంధించిన అంశాలు.
- జియాలజీ: జియో మార్ఫాలజీ అండ్ ఫీల్డ్ జియాలజీ, మినరాలజీ అండ్ ఆప్టికల్ మినరాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, అండ్ జియోటెక్టానిక్స్, జియో కెమిస్ట్రీ, మెటామార్ఫిక్ పెట్రోలజీ అండ్ థర్మోడైనమిక్స్, సెడిమెంటాలజీ అండ్ పెట్రోలియం జియాలజీ, తదితర అంశాలు.
- ఫార్మసీ: మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్, మెథడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రూడ్ డ్రగ్స్, సెకండరీ మెటబాలిక్స్, డ్రగ్ డిస్కవరీ అండ్ క్లినికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ న్యూ డ్రగ్స్, ఫార్మకాలజీ సంబంధిత అంశాలు.
- కెమిస్ట్రీ: ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీలకు సంబంధించిన అంశాలు.
- ఫిజిక్స్: మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, న్యూక్లియర్ అండ్ ప్రాక్టీస్ ఫిజిక్స్ తదితర అంశాలు.
- మ్యాథమెటిక్స్: రియల్ అనాలిసిస్, కాంప్లెక్స్ అనాలిసిస్, లీనియర్ అల్జీబ్రా, అల్జీబ్రా, డిఫరెన్షియల్ ఈక్వేషన్‌కు సంబంధించిన అంశాలు.
- ఇంగ్లిష్: రైటర్స్ అండ్ టెక్ట్స్, లిటరేచర్, మోడ్రనిజం, ఈఎల్‌టీ ఇన్ ఇండియా, టీచింగ్ లాంగ్వేజ్ స్కిల్స్, టెస్టింగ్ అండ్ ఎవాల్యుయేషన్, ఫొనెటిక్స్ అండ్ ఫొనాలజీ, సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ తదితరాలు.
అప్లికేషన్ ఓరియెంటేషన్
అభ్యర్థులు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా.. పేపర్-2 సబ్జెక్ట్‌కు సంబంధించి.. బీటెక్ స్థాయిలోని అకడమిక్ పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయాలి. మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్‌లు రాయడం కూడా పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది.
చదవండి: Group 2 Preparation Plan: గ్రూప్–2పై గురిపెట్టండిలా!
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 29 - ఫిబ్రవరి 18, 2024
- పరీక్ష తేదీ: ఏప్రిల్/మేలో నిర్వహించే అవకాశం.
- వెబ్‌సైట్: https://psc.ap.gov.in/
Tags
- APPSC
- APPSC Job Notification 2024
- Govt Polytechnic Colleges
- APPSC Polytechnic Lecturer Notification
- Polytechnic Lecturer Jobs
- APPSC Polytechnic Lecturer Notification 2024
- APPSC Study Material
- APPSC Bitbank
- General Studies and General Ability
- Current Affairs
- General Science
- Architectural Engineering
- Automobile Engineering
- Computer Engineering
- Civil Engineering
- model papers
- Mock Tests
- APPSCJobs
- PolytechnicLecturer
- Recruitment Process
- sakshi education latest job notifications
- latest jobs in 2024