Skip to main content

Group 2 Preparation Plan: గ్రూప్‌–2పై గురిపెట్టండిలా!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగార్థులకు.. ముఖ్యంగా గ్రూప్స్‌ అభ్యర్థులకు వరుస నోటిఫికేషన్లు స్వాగతం పలుకుతున్నాయి! ఇప్పటికే గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. తాజాగా గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ను సైతం ప్రకటించింది. మొత్తం 897 పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది. సర్కారీ కొలువులు కోరుకునే గ్రాడ్యుయేట్లకు ఇది సువర్ణావకాశం. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
appsc group 2 preparation plan in telugu   Preparation Tips for APPSC Group-2:  Application Process for Group-2
  • గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
  • మొత్తం 897 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ 
  • స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామ్, సీపీటీ ఆధారంగా ఎంపిక
  • 2024, ఫిబ్రవరి 25న స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహణ
  • బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం

మొత్తం 897 పోస్ట్‌లు
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 897 పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌లు, 566 నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి తొలి దశ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు.

ఎంపిక ప్రక్రియ
గ్రూప్‌–2 పోస్ట్‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. తొలి దశలో స్క్రీనింగ్‌ టెస్ట్, తర్వాత దశలో మెయిన్‌ పరీక్ష ఉంటాయి. ఈ రెండు పరీక్షలు కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతాయి. మెయిన్‌లో మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే గ్రూప్‌2 కొలువు ఖరారవుతుంది.

చ‌ద‌వండి: APPSC Group-1,2: గ్రూప్స్‌ అభ్యర్థులు చదవాల్సిన పుస్తకాలు ఇవే!! 

150 మార్కులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌
ఎంపిక ప్రక్రియ తొలి దశలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఒకే పేపర్‌గా 150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ అంశాలపై మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు.

రెండో దశలో మెయిన్‌

  • స్క్రీనింగ్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. రిజర్వేషన్‌ వర్గాల వారీగా ఒక్కో పోస్ట్‌కు 50 మందిని చొప్పున రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు.
  • పేపర్‌ 1లో 150 మార్కులకు రెండు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్‌ 1లో సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు), సెక్షన్‌ 2లో భారత రాజ్యాంగం సమీక్షపై ప్రశ్నలు అడుగుతారు. 
  • అదేవిధంగా పేపర్‌ 2లోనూ 150 మార్కులకు రెండు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్‌–1లో భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ; సెక్షన్‌–2లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై ప్రశ్నలు ఎదురవుతాయి. 
  • ప్రతి పేపర్‌లోనూ ఒక్కో సెక్షన్‌ నుంచి 75 ప్రశ్న­లు అడిగే అవకాశం ఉంది. పరీక్షను ఓఎంఆర్‌ లే­దా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులను తగ్గిస్తారు.

మెయిన్స్‌.. మారిన విధానం
గ్రూప్‌–2 తాజా నోటిఫికేషన్‌ ప్రకారం–మెయిన్‌ పరీక్షలో మార్పులు చేశారు. గతంలో మూడు పేపర్లుగా 450 మార్కులకు మెయిన్‌ను నిర్వహించేవారు. ఇప్పుడు దాన్ని రెండు పేపర్లకు మార్చారు. తాజా విధానం ఫలితంగా అభ్యర్థులపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.

చ‌ద‌వండి: APPSC Group 1&2 Notification: 597 పోస్ట్‌లు.. సిలబస్‌పై పట్టు.. కొలువుకు మెట్టు

కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌
గ్రూప్‌–2 అభ్యర్థులకు చివరగా కంప్యూటర్‌ ప్రొ­ఫిషియన్సీ టెస్ట్‌ ఉంటుంది. మెయిన్‌ పరీక్షలో అర్హత పొందిన వారిని 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి.. కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ను 100 మార్కులకు నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థులకు కంప్యూటర్‌ ఆపరేటింగ్‌పై ఉన్న పరిజ్ఞానాన్ని, బేసిక్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్న పత్రం ఉంటుంది. ఇందులో ఎంఎస్‌ వర్డ్‌లో లెటర్‌ టైపింగ్,ఎంఎస్‌ ఎక్సెల్‌ వినియోగించి టేబుల్స్,గ్రా­ఫ్స్‌ రూపొందించడం, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపొందించడం వంటి అంశాలు ఉంటాయి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 2023, డిసెంబర్‌ 21–2024, జనవరి 10
  • స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీ: 2024, ఫిబ్రవరి 25
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌
2024, ఫిబ్రవరి 25న గ్రూప్‌2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంటే.. అభ్యర్థులకు దాదాపు రెండున్నర నెలల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో సిలబస్‌ అంశాలపై పట్టు సాధించేలా పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి. అందుకోసం ముందుగా సిలబస్‌ను సమగ్రంగా అవగాహన చేసుకోవాలి.

చ‌ద‌వండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

కాన్సెప్ట్స్‌ + సమకాలీనం
ఆయా సబ్జెక్టుల సిలబస్‌ టాపిక్స్‌ను సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ.. డిస్క్రిప్టివ్‌ విధానంలో ప్రిపరేషన్‌ సాగించాలి. తద్వారా కోర్‌ సబ్జెక్ట్‌పై పట్టుతోపాటు సమకాలీన పరిస్థితుల్లో అ­న్వయించే నైపుణ్యం కూడా లభిస్తుంది. అభ్యర్థులు సిలబస్‌ అంశాలకు లభిస్తున్న వెయిటేజీని పరిశీలించాలి.పరీక్ష కోణంలో ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించే నైపుణ్యం పెంచుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లలో ప్ర­త్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను గుర్తించాలి.

విశ్లేషణాత్మకంగా
ఆయా సిలబస్‌ అంశాలను చదివేటప్పుడు విశ్లేషణాత్మక దృక్పథాన్ని అనుసరించాలి. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహనతోపాటు విశ్లేషణ, స్వీయ అభిప్రాయ దృక్పథం పెంచుకోవాలి. ముఖ్యమైన అంశాలకు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి.

పథకాలపై పట్టు
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నవరత్నాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య తదితర వివరాలను అవపోసన పట్టాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటిద్వారా కలిగిన అభివృద్ధిపై దృష్టి సారించాలి. దీంతోపాటు జాతీయ స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, నూతన జాతీయ విద్యా విధానం, ఇటీవల కాలంలో కీలకమైన తీర్పుల గురించి పూర్తి అవగాహన పెంచుకోవాలి.

చ‌ద‌వండి: Group 1&2 Notification 2023: గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టుల వివరాలు.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

సబ్జెక్ట్‌లు.. కీలక అంశాలు

  • హిస్టరీలో.. రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ.. ముఖ్యమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. ఇదే వి«ధంగా భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. 
  • జాగ్రఫీలో.. రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరుల గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి. అదే విధంగా చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు.. వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
  • పాలిటీలో.. రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొద­లు తాజా పరిణామాలు (రాజ్యాంగ సవరణలు, వాటి ప్రభావం) తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్‌ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా, సివిల్, క్రిమినల్‌ లా, కార్మిక చట్టాలు, సైబర్‌ చట్టాలు, ట్యాక్స్‌ లాస్‌ గురించి తెలుసుకోవాలి.
  • ఎకానమీలో.. మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణ­లు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్‌ సర్వేలపై అవగాహన పొందాలి.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి.
  • పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పొందాలి.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

sakshi education whatsapp channel image link

Published date : 08 Jan 2024 05:49PM

Photo Stories