Skip to main content

TSPSC&APPSC : గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో కీలకమైన ‘హిస్టరీ’ నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..?

తెలంగాణలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష త్వరలోనే జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలోనే గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.
indian history
History

ఈ నేపథ్యంలో.. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో  కీలకమైన హిస్టరీ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో.. ఎలా ప్రిపరేషన్‌  సాగించడమెలాగో తెలుసుకుందాం ఇలా..

TSPSC Group-1 Mains: గ్రూప్స్‌-1 మెయిన్స్‌కి ఇవి చ‌దివితే.. కొలువు మీదే..!

కీలకమైన హిస్టరీని ఇలా చదివారంటే..?
టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ.. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో కీలక సబ్జెక్ట్‌గా హిస్టరీని పేర్కొనొచ్చు. ఇందులో భారతదేశ చరిత్రతోపాటు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విభాగం నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. దీంతో.. అభ్యర్థులు హిస్టరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా సంబంధిత రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, కళలు, సాహిత్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

టాపిక్‌ వారీగా వెయిటేజీ అంచనా..
➤ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. 150 మార్కులకు జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ పేరుతో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 13 అంశాలను సిలబస్‌లో పేర్కొన్నారు. ఈ టాపిక్స్‌ అన్నీ కూడా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్నవే. కాబట్టి ఒక్కో అంశం నుంచి 10 నుంచి 15 వరకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
➤ ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1లో.. ప్రిలిమ్స్‌ను స్క్రీనింగ్‌ పరీక్ష పేరుతో రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. ఇందులో పేపర్‌–1 నాలుగు సబ్జెక్ట్‌ల నుంచి(హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ)120 ప్రశ్నలు, అదే విధంగా పేపర్‌–2లో రెండు విభాగాలుగా మూడు అంశాల నుంచి(మొదటి విభాగంలో జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ అండ్‌ సైకలాజికల్‌ ఎబిలిటీస్‌; రెండో విభాగంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌) 120 ప్రశ్నలు అడుగుతున్నారు.
➤ పేపర్‌–1లో నాలుగు సబ్జెక్ట్‌ల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులు; పేపర్‌–2లో పార్ట్‌–ఏ నుంచి 60 ప్రశ్నలు, పార్ట్‌–బీ నుంచి 60 ప్రశ్నలు చొప్పున అడుగుతారని స్పష్టం చేశారు. 
➤ ఈ సమాచారం ఆధారంగా అభ్యర్థులు ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన పొందాలి.

TSPSC Group-1 Prelims: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో కరెంట్‌ అఫైర్స్, జీకే నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..?

​​​​​​​టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 18 May 2022 06:09PM

Photo Stories