TSPSC Group-1 Prelims: గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో కరెంట్ అఫైర్స్, జీకే నుంచి ఎన్ని మార్కులు వస్తాయంటే..?
ఈ నేపథ్యంలో.. గ్రూప్–1 ప్రిలిమ్స్ నుంచి కరెంట్ అఫైర్స్, జీకే నుంచి ఎన్ని మార్కులు వస్తాయో.. ప్రిపరేషన్ ఎలా సాగించడమెలాగో తెలుసుకుందాం...
TSPSC Group-1 Prelims: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఇలా ప్రిపేరయ్యారంటే..?
కరెంట్ అఫైర్స్, జీకే ని ఇలా చదివారంటే...?
గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో... కరెంట్ అఫైర్స్, జీకే విభాగం నుంచి 12 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని అంచనా. కోర్, కాంటెంపరీ అంశాల కలయికగానూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీనికి విస్తృత అధ్యయనం అవసరం. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో.. పరీక్షకు ముందు çసంవత్సర కాలంలో జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలించాలి. ముఖ్యంగా.. సమావేశాలు, సదస్సులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్, అవార్డులు, స్పోర్ట్స్ వంటివి. అంశాల వారీగా ప్రిపరేషన్ సాగించటం మంచిది. అదే విధంగా ఒక ఇంగ్లిష్, తెలుగు దినపత్రికతోపాటు ప్రముఖ కాంపిటీటివ్ మ్యాగజైన్‌ను తప్పనిసరిగా అనుసరించాలి. టెక్ట్స్‌బుక్ చదివినట్లుగా కాకుండా.. రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్ అంశాలను ఏరోజుకారోజు చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిలిమ్స్‌కు ప్రిపరేషన్ సాగిస్తూనే.. ఆయా అంశాలపై రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఫలితంగా మలి దశలో మెయిన్స్ పరీక్ష సమయంలో కొంత వేగంగా ప్రిపరేషన్ పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
Books for Groups Preparation: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..